Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ హీరోల రికార్డులు గల్లంతు.. 3వ రోజు 'సాహో' సంచలనం!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం అంచనాలకు అందకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నెగిటివిటీని సైతం లెక్కచేయకుండా ఆడియన్స్ సాహో చిత్రాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో చిత్రానికి ప్రీమియర్ షోల నుంచే డివైడ్ టాక్ మొదలైంది. 

Saaho movie 3 days Hindi version box office collections
Author
Hyderabad, First Published Sep 2, 2019, 3:08 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం అంచనాలకు అందకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నెగిటివిటీని సైతం లెక్కచేయకుండా ఆడియన్స్ సాహో చిత్రాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో చిత్రానికి ప్రీమియర్ షోల నుంచే డివైడ్ టాక్ మొదలైంది. దీనితో సాహో చిత్రం సాధించబోయే వసూళ్లపై పలు అనుమానాలు తలెత్తాయి. 

కానీ హిందీ వర్షన్ సాహోకి వస్తున్న వసూళ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సాహో చిత్రం 3వ రోజు నార్త్ లో సంచలనమే సృష్టించింది. తొలి రోజు సాహో హిందీ వర్షన్ 24 కోట్లు సాధించగా, శనివారం రోజు 25 కోట్లు సాధించింది. ఆదివారం రోజు కళ్ళు చెదిరే నంబర్స్ నమోదయ్యాయి. ఏకంగా 29 కోట్లని సండే రోజు సాహో  హిందీ కొల్లగొట్టింది. 

మొత్తంగా సాహో చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో 79 కోట్ల నెట్ రాబట్టింది. సాహో ప్రభంజనంతో ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల రికార్డులు గల్లంతవుతున్నాయి. తొలి సండే వసూళ్ళని పరిగణలోకి తీసుకుంటే ఇటీవల విడువులైన మిషన్ మంగళ్, భారత్, కబీర్ సింగ్ చిత్రాలంటే ఎక్కుగా సాహో సాధించింది. 

సాహో టాక్ కి, వస్తున్న వసూళ్ళని సంబంధం లేకపోవడంతో బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. బాలీవుడ్ క్రిటిక్స్ ఈ చిత్రం చెత్తగా ఉందంటూ రేటింగ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సాహో హిందీ వర్షన్ తొలి వీకెండ్ లో 79 కోట్ల నెట్ రాబట్టగా, బాహుబలి 2 చిత్రం 128 కోట్లు సాధించింది. 

నార్త్ లో 'సాహో' కలెక్షన్ల సునామి.. ఏంటీ మాయ!

నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో సాహో రెండవరోజు వసూళ్లు!

'సాహో' బాక్సాఫీస్: యూఎస్ లో కలెక్షన్ల పరిస్థితి ఇది!

సాహో వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆల్ టైమ్ రికార్డ్

రాజమౌళి సెంటిమెంట్ దెబ్బ.. ప్రభాస్ పై గట్టిగా పడిందే..!

'సాహో' పై నటి లిసా రే కాపీ ఆరోపణలు!

సాహో టాక్ పై కృష్ణంరాజు సతీమణి.. చిన్న దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు!

'సాహో' టాక్.. ట్రెండింగ్ లో అజ్ఞాతవాసి, లార్గో వించ్!

ప్రభాస్ 'సాహో'కి బిగ్ షాక్.. విడుదలైన గంటల్లోనే!

'సాహో' హైలైట్స్.. థియేటర్లో అభిమానుల కెవ్వుకేక!

'సాహో'ని ఫ్లాప్ అంటోంది పవన్ ఫ్యాన్సే.. శ్రీరెడ్డి కామెంట్స్!

అవాస్తవాలను ప్రచారం చేయకండి.. ప్రభాస్ ఫ్యాన్స్ కి శ్రద్ధా వార్నింగ్!

సాహో మూవీ రివ్యూ

'సాహో' ప్రీమియర్ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే..?

Follow Us:
Download App:
  • android
  • ios