ప్రభాస్ నూ పడేసిందా.. బికినీ బేబీ తగ్గట్లేదుగా..
- డీజేతో ఫేమస్ అయిన పూజా హెగ్డే
- డీజే తర్వాత క్రేజీ స్టార్ గా మారిన పూజ
- ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో ఫిక్సయిన పూజ
- తాజాగా ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు
డీజే చిత్రం తరువాత యువత మొత్తం పూజా హెగ్డే జపం చేస్తున్నారు. ఆ చిత్రంలో పూజా హెగ్డే చేసిన అందాల మాయ అంతా ఇంతా కాదు. ఏకంగా బికినిలో మెరిసి యువత కలల రాణిగా మారిపోయింది. యువతలో పూజకు భారీ క్రేజ్ ఉండడంతో ప్రస్తుతం స్టార్ హీరోలంతా పూజా జపం చేస్తున్నట్లు ఉన్నారు. వరుసగా పూజా హెగ్డే వరుసగా క్రేజీ ఆఫర్ లు అందుకుంటూ టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి చేరుకుంటోంది. పూజ హెడ్డే త్వరలో ప్రారంభం కాబోతున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో కొట్టేసింది. తరువాత మహేష్ సరసన నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ వస్తున్న వార్తల ప్రకారం పూజా మరో బిగ్ ఆఫర్ కు చేరువైనట్లు తెలుస్తోంది.
పూజా హెగ్డే ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ముకుంద చిత్రంలో నటించింది. కానీ ఈ రెండు చిత్రాలు పూజ హెగ్డేకు కలసి రాలేదు. ఒక లైలా కోసం, ముకుంద చిత్రాల తరువాత పూజా హెగ్డే బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ హృతిక్ రోషన్ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. మొహంజదారో చిత్రంలో అందాలు ఆరబోసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనితో అక్కడ కూడా పూజకు అవకాశాలు పెద్దగా రాలేదు.
అయితే అవకాశాలు కనుమరుగవుతున్న తరుణంలో డీజే చిత్రం రూపంలో ఈ సెక్సీ హీరోయిన్ ని అదృష్టం తలుపు తట్టింది. అందివచ్చిన అవకాశంతో బన్నీ సరసన అందాల ఆరబోతలో చెలరేగిపోయింది. ఏకంగా బికినిలో మెరిసి కుర్రకారుని గిలిగింతలు పెట్టింది. డీజే చిత్రం తరువాత యువత, దర్శకనిర్మాతలు సహా హీరోలు కూడా పూజ హెగ్డే జపం చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఖరారైంది. మహేష్, వంశి పైడి పల్లి ప్రాజెక్ట్ కు పూజని హీరోయిన్ గా అనుకున్నారు.
బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ క్రేజ్ జాతీయ వ్యాప్తం అయింది. ప్రభాస్ సరసన నటించాలని బాలీవుడ్ హీరోయిన్లే ఉవ్విళ్లూరుతున్నారు. అలాంటి లక్కీ ఛాన్స్ పూజా హెగ్డేకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి పూజా హెగ్డే హీరోయిన్ అంటూ వార్తలు గుప్పుమన్నాయి.