అందాల పాయల్ రాజ్ పుత్ కోపంతో ఊగిపోయింది. హాట్ అందాలతో సోషల్ మీడియాను శేక్ చేస్తూ వచ్చిన బ్యూటీ.. పట్టరాని కోపంతో ఊగిపోయింది. ఇంతకీ ఈ అందాల రాశికి కోపమెందుకొచ్చింది. 

టాలీవుడ్ బ్యూటీ క్వీన్ పాయల్ రాజ్ పుత్. హద్దులులేకుండా అందాలు ఆరబోయడంలో టాలీవుడ్ లో ఆమె తరువాతే. అటువంటిది అందాల రాశి పాయల్ రాజ్ పుత్‌కు పట్టరాని కోపం వచ్చింది. కోపాన్ని చూపిస్తూ.. చిందులేసింది.. చిర్రుబుర్రులాడింది. ఏకంగా ఎయిర్ పోర్ట్ స్టాఫ్ పై మండిపడింది పాయల్. ఇంతకీ ఈ స్టార్ బ్యూటీకి ఇంత కోపం ఎందుకు వచ్చిందటే..? ఇంతకు అమ్మడికి అంతకోపం ఎందుకు వచ్చిందంటే.. 

రీసెంట్ గా ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో పాయ‌ల్ రాజ్‌పుత్‌ జర్నీ చేసింది. ఈ సంద‌ర్భంగా త‌న ల‌గేజీని చూసుకోగా అది దారుణంగా డామేజ్ అయ్యింది. దాంతో ఇండిగో విమాన సిబ్బంది ఇష్టానుసారంగా విరిసిరేశారని కోపంతో రగిలిపోయింది పాయల్. లగేజ్ ను ఇలా నిర్ల‌క్ష్యంగా విసిరిపారేస్తారా...? . దీంతో త‌న ల‌గేజీ డ్యామేజీ అయ్యింద‌ని చెప్పుకొచ్చిన పాయల్. అంతే కాదు ఈ ప్ర‌యాణం త‌న‌కు ఎప్పుడూ ఎదుర‌వ‌ని చేదు అనుభ‌వాన్ని మిగిల్చింద‌ని అంటోంది పాయల్. 

ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది పాయల్. అంతే కాదు అలాగే డ్యామేజ్ అయిన లగేజ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రైవేటు విమాన‌యాన సంస్థ సిబ్బంది అత్యుత్సాహమే ఇందుకు కారణం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది పాయల్. ఈ విషయంలో నెటిజన్లు పాయల్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఒక హీరోయిన్ లగేజ్ పరిస్థితే ఇలా అయితే.. కామన్ పాసింజర్స్ లగేజ్ ను వీళ్లు ఎలా చూస్తారంటూ మండిపడుతున్నారు. 

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ తన అందంతో అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏమాత్రం తగ్గకుండా స్కిన్షో చేస్తూ.. అదరగొడుతూ వచ్చింది. ఏమాత్రం మొహమాట పడకుండా పాయల్ చేసిన పర్ఫామెన్స్ కు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇక ఆర్ ఎక్స్ 100 తరువాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో హిట్స్ పడలేదు. క్రేజీ ఆఫర్స్ వచ్చినప్పటికీ హిట్స్ మాత్రం పడలేదు.

 ప్రస్తుతం వరుస ఆఫర్లు సాధిస్తుంది పాయల్ .. కాని కరెక్ట్ కమర్షియల్ హిట్ మాత్రం పడటంలేదు. ఇక ఈ మధ్య ఆది సాయి కుమార్ తో హాట్ హాట్ మూవీ ఒకటి చేసింది. ప్రస్తుతం మంచు విష్ణు తో జిన్నా సినిమా చేస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోయి రచ్చ రచ్చ చేస్తుంటుంది. కుర్రాళ్లకు చెమటలు పట్టించేలా అందాలు ఆరబోస్తూ.. ఫోటోలు శేర్ చేసుకుంటుంది.