Asianet News TeluguAsianet News Telugu

షారూఖ్ అక్కడ చెయ్యపెట్టాడేంటి...ట్రోలింగ్ మొదలెట్టేసారు

  షారుఖ్ ఖాన్ నటిస్తున్న సరికొత్త చిత్రం పఠాన్. ఇందులో దీపికా పదుకునే హీరోయిన్‌గా చేస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Netizens troll the latest song of Pathaan Besharam Rang
Author
First Published Dec 12, 2022, 6:42 PM IST

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న పఠాన్ మూవీ నుండి  ఫస్ట్ సింగిల్ గా బేషరం రంగ్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ పాట కొంతమందికి విపరీతంగా నచ్చుతూండగా మరికొంతమంది ట్రోల్ చేస్తున్నారు.  ఈ పాటలో దీపికా బికినీ ట్రీట్ కుర్రకారుకు పెద్ద బహుమతి అనే చెప్పాలి. ఇక, ఆమె సూపర్ హాట్ లుక్స్, అమేజింగ్ డాన్స్ మూవ్మెంట్స్ ..కనురెప్ప వెయ్యనియ్యకుండా చేస్తున్నాయి. అయితే అదే సమయంలో షారుఖ్ ఖాన్ ...పాట చివర్లో ఆమె హాఫ్ బికినీ పై చెయ్య పెట్టడం నచ్చలేదని, ఫ్యామిలీలతో మీ సినిమా చూడలేమంటూ ట్రోల్ చేస్తున్నారు.

షారూఖ్ ఖాన్ సినిమాలో ఇలాంటి వల్గర్ ని ఎక్సపెక్ట్ చేయలేదని చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పాటపై వ్యతిరేకత మొదలైంది. మరికొంతమంది యూట్యూబ్ లో ఆ వీడియో క్రింద కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్ లో రచ్చ అయితే చెప్పక్కర్లేని స్దాయిలో ఉంది. మీరు ఈ పాటపై ఓ లుక్కేయండి.
  
ఇదిలా ఉంటే ఈ సాంగ్ లో దీపికా అందాల ఆరబోత చేయడం..షారుఖ్ సిక్స్ ప్యాక్ తో కనిపించడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నాలుగేళ్ల విరామం తర్వాత షారుఖ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా అయిపోయాయి. స్పెయిన్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ఇద్దరి మధ్య రొమాంటిక్‌గా చిత్రీకరించిన ఈ సాంగ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. చిత్రీకరణ సమయంలోనే దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట్ లీకైన విషయం తెలిసిందే. కాగా.. పాట మొత్తం కలర్‌ఫుల్ హాఫ్ బికినీల్లో కనిపించిన దీపిక.. తన కర్వ్‌డ్ బాడీతో అందాలు ఆరబోస్తూ కనిపించింది.

 గతంలో ‘ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్’ వంటి బ్లాక్‌బస్టర్స్‌తో హిట్ పెయిర్‌గా నిలిచిన ఈ జంట.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోని బెస్ట్ ఆన్-స్క్రీన్ జోడీల్లో ఒకరు. ఈ మూవీకి విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించగా.. కుమార్ లిరిక్స్ రాసిన ‘బేషరమ్ రంగ్’ సాంగ్‌ను శిల్పా రావు, కరాలీసా మోంటెరో, విశాల్, శేఖర్ కలిసి పాడారు. జాన్ అబ్రహాం విలన్ రోల్ పోషించిన చిత్రంలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ కామియో రోల్‌లో కనిపించనున్నట్లు వినికిడి.   సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఏకకాలంలో విడుదల కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios