హాట్ గా కనిపించేలానే హీరోయిన్ల తపన వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. రజినీకాంత్, బాలయ్య వంటి స్టార్ హీరోలతో రాధికా ఆప్టే నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో నటిస్తుంది.అవకాశాలు పెద్దగా లేకపోయిన చిన్న చిన్న ఆఫర్లతో నెట్టుకొస్తుంది. ఇటీవల రాధికా ఆప్టే అక్షయ్ కుమార్ ప్యాడ్ మాన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాధికా నటనకు ప్రశంసలు దక్కాయి. తాజాగా సోషల్ మీడియాలో రాధికా ఆప్టే మరో వివాదానికి కారణం అయ్యింది. పర్చెడ్ చిత్రంలో నగ్నంగా శృంగార సన్నివేశాలో నటించి షాక్ ఇచ్చింది. ఆ సమయంలో రాధికా ఆప్టేపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి.సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన కబాలి చిత్రంలో రాధికా నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ లో కొన్ని చిత్రాలలో నటిస్తోంది. రాధికా ఆప్టే తన విదేశీ ప్రేమికుడితో ఘాటు ప్రేమాయణం సాగిస్తోంది.

 

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే తన ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది.ఇటీవల రాధికా తన ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ  ఒక బికినీ స్టిల్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాధికా ఆప్టే బికినీ అందాలు ఆరబోసి తన ప్రియుడితో బీచ్ లో కూర్చుని ఉన్న ఫోటో అది. ఇద్దరూ డ్రింక్ తాగుతూ బీచ్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.రాధికా ఇలా బికినిలో ప్రియుడితో కనిపించడంతో కొందరికి చిర్రెత్తుకొచ్చింది. బట్టలు లేకుండా ఇలా ప్రియుడితో ఫోటోలు దిగి సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గ్లామర్ ప్రియులు మాత్రం రాధికా బికినీ అందాలని ఆస్వాదిస్తున్నారు.