నడిరోడ్డులో ప్రియుడితో రొమాన్స్ చేస్తు దొరికిన నయనతార

First Published 17, Feb 2018, 1:33 PM IST
Nayanathara romance with boyfriend on streets
Highlights
  • ప్రియుడితో రొమాన్స్ చేస్తు దొరికిన నయనతార
  • నయన్, విగ్నేష్ జంటకు పెళ్ళైపోయిందంటూ వార్తలు
  • ప్రభు దేవా, శింబు తో పెళ్లి వరకు ప్రేమాయణం​

నయనతార సౌత్ లో ఓ సంచలనం. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే పబ్లిక్ గా ఈ అమ్మడు ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ప్రియుడితో ఘాటు రొమాన్స్ లో తేలుతోంది. నయనతార కొంత కాలంగా తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రియుడితో నయనతార పబ్లిక్ రొమాన్స్ సినీ వర్గాల్లో హాట్ హాట్ చర్చ మొదలైంది.


నయనతార తన ప్రియుడి విగ్నేష్ తో కలసి ఉన్న రొమాంటిక్ పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రియుడితో నయన్ రొమాంటిక్ కౌలిగిలింతలో మునిగిపోయింది. ఈ ఫొటోలో జంట చూడ ముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నయన్ ఈ పిక్ ని వాలంటైన్స్ డే సందర్భంగా షేర్ చేసినట్లు తెలుస్తోంది.
నయన్, విగ్నేష్ జంటకు పెళ్ళైపోయిందంటూ కూడా వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో సంచలనంగా మారాయి. నయనతార, విగ్నేష్ రహస్య వివాహం చేసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


నయన్, విగ్నేష్ ధరించిన డ్రెస్ లో ఓ ప్రత్యేకత ఉంది. విగ్నేష్ ధరించిన టి షర్ట్ పై అతడి పేరులోని మొదటి ఆంగ్ల అక్షరం 'వి' ఉండగా నయన్ ధరించిన టి షర్ట్ పై 'ఎన్' ఉంది.
గతంలో నయన్ కు ప్రభుదేవా, శింబు తో బ్రేక్ అప్ అయిందనే ప్రచారం ఉంది. ప్రభు దేవా, శింబు తో పెళ్లి వరకు ప్రేమాయణం వెళ్లిందని కానీ చివర్లో విభేధాలతో విడిపోయారనే ప్రచారం ఉంది. దీనిపై నయన్ ఎప్పూడూ స్పందించలేదు.


కనీసం ఈ ప్రేమ తంతునైనా నయనతార సుఖాంతం చేస్తుందా అనే అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సహజీవన లో ఉన్నారు, పెళ్ళై పోయింది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నయన్ ఏ విషయాన్ని ప్రకటించడం లేదు.
కెరీర్ పరంగా వీరిద్దరూ మంచి పొజిషన్ లో ఉన్నారు. విగ్నేష్ తెరకెక్కించిన గ్యాంగ్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. నయనతార మెగాస్టార్ చిత్రం సైరా వంటి క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతోంది.

loader