Asianet News TeluguAsianet News Telugu

#Bimbisara:అఫీషియల్ ..‘బింబిసార’ ఓటీటీ రిలీజ్ డేట్ !

ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన బింబిసార బ్లాక్ బస్టర్ అయ్యేసరికి.. ఓటిటి అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. అయితే.. బింబిసార మూవీ ఓటిటి హక్కులను జీ5 సంస్థ దక్కించుకుంది. 

Nandamuri Kalyanram Bimbisara gets OTT release date
Author
First Published Oct 5, 2022, 6:01 AM IST

 నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా చారిత్రక కథాంశంతో వచ్చి సక్సెస్ అయ్యిన చిత్రం ‘బింబిసార’. చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ కు సక్సెస్ వచ్చింది.  టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం టైట్ స్క్రీన్ ప్లే తో  అందరినీ ఆకట్టుకుంది. త్రిగర్తలను పాలించిన బింబిసార క్యారెక్టర్ చుట్టూ ఫిక్షనల్ స్టోరీ అల్లుకున్న డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను రూపొందించాడు. కళ్యాణ్ రామ్ మొదటిసారి పీరియాడిక్ కింగ్ రోల్ ప్లే చేసి సినిమాని నిలబెట్టాడు. అలాగే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యూయెల్ రోల్ లో కనిపించటం విశేషం.  కల్యాణ్‌ రామ్‌ ఈ సినిమాలో బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తివంతమైన పాత్రలో కనిపించారు.చాలా కాలం తర్వాత బింబిసారతో మంచి విజయాన్ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్.

ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన బింబిసార బ్లాక్ బస్టర్ అయ్యేసరికి.. ఓటిటి అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. అయితే.. బింబిసార మూవీ ఓటిటి హక్కులను జీ5 సంస్థ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం.. బింబిసార అక్టోబర్ 21 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఓటిటి ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.
 
బింబిసారుడు కాలాన్ని ఎదురీది ప్రస్తుత కాలంలోకి వ‌స్తాడు.  బింబిసారుడు క్రూరుడు. యుద్ద కాంక్ష‌తో ర‌గిలిపోయి.. యుద్ధాలు చేసి అంతులేని సంప‌ద‌ను సేక‌రిస్తాడు. అలాంటి చ‌క్ర‌వ‌ర్తి కాలానికి ఎదురీది ప్ర‌స్తుత కాలానికి ఎలా చేరుకుంటాడు? అలా చేరుకున్న ఆయ‌న ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటాడు? క్రూరుడైన బింబిసారుడు మంచి వాడుగా మారాడా? అందుకు ఎలాంటి ప‌రిస్థితులు దోహ‌ద‌ప‌డ్డాయి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.. వశిష్ట్‌ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌  హీరోయిన్స్ గా నటించారు.  ‘బింబిసార’ హిట్ కావడంతో.. ఇప్పుడు బింబిసార 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది. బింబిసార చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తార‌న‌టంలో సందేహం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios