Asianet News TeluguAsianet News Telugu

Nagarjuna:గోవాలో ఐసోలేషన్ లో నాగార్జున

 

"బంగార్రాజు" ప్రొడక్షన్ టీమ్‌లో ఎక్కువ కోవిడ్-19 కేసులు వచ్చాయి . అందుకే నాగార్జున ఈ నిర్ణయం తీసుకుననారు.  గోవాలోని ఓ విల్లాలో ఉండనున్నారు. రెండు వారాల తర్వాత హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. 

Nagarjuna goes for isolation in Goa
Author
Goa, First Published Jan 22, 2022, 7:07 AM IST


అక్కినేని నాగార్జున తాజా చిత్రం బంగార్రాజు రెండో వారంలోకి అడుగుపెట్టింది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అన్నీ పూర్తి చేశాడు. శుక్రవారం కూడా తిరుమల వెళ్లి పూజలు చేశారు. ఆ తర్వాత నాగార్జున కొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉండేందుకు గోవా వెళ్లాడు. నాగార్జున, ఆయన భార్య అమల గోవాలో వారం, రెండు రోజులు ఉండేందుకు వెళ్లారు. కోవిడ్ 19 కేసులు పెరుగుతుండటంతో, నాగార్జున ఏకాంత స్థలాన్ని కోరుకుని గోవాకు వెళ్లిపోయారు.

"బంగార్రాజు" ప్రొడక్షన్ టీమ్‌లో ఎక్కువ కోవిడ్-19 కేసులు వచ్చాయి . అందుకే నాగార్జున ఈ నిర్ణయం తీసుకుననారు.  గోవాలోని ఓ విల్లాలో ఉండనున్నారు. రెండు వారాల తర్వాత హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. మరో ప్రక్క  వచ్చే నెలలో నాగార్జున “బిగ్ బాస్ తెలుగు OTT” హోస్ట్ చేయనున్నారు. పనులు జరుగుతున్నాయి.

ఇక కొవిడ్ భయానికి పాన్ ఇండియా సినిమాలు సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంటే.. నేనున్నానంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు బంగార్రాజు. పోటీ పెద్దగా లేదు.. బరిలో పెద్ద స్టార్స్ లేరు.. సో అక్కినేని హీరోలు హవా కొనసాగిస్తున్నారు. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీతో సహా ఆడియెన్స్ ను థియేటర్స్ కి తీసుకొచ్చే పండుగ. అందుకే ఉన్న ఒక్క ఆప్షన్ ను వదులుకోలేక బంగార్రాజు బాటపట్టారు ప్రేక్షకులు.

 కేవలం మూడే నెలల్లో సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ ను పూర్తి చేసేశాడు డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ. నాగ్ కాంబినేషన్ లో చై నటించడం.. చైకి జోడీగా కృతిశెట్టి కనిపించడం.. ఫరియా అబ్దుల్లా లాంటి హీరోయిన్స్ తో అట్రాక్ట్ చేయడం కలిసొచ్చింది సోగ్గాళ్లకి. గతంలో సంక్రాంతికి ఒక్క సోగ్గాడే సందడి చేస్తే.. ఈసారి సేమ్ ఫ్లేవర్ తో తండ్రీకొడుకులు హుషారెత్తించారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios