Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో  అల్లు అర్జున్ "నా పేరు సూర్య " కీలక సన్నివేశాల చిత్రీకరణ

  • అల్లు అర్జున్, వక్కంతం వంశీల కాంబినేషన్ లో నా పేరు సూర్య
  • తాజాగా హైదరాబాద్ లో షూటింగ్ షెడ్యూల్
  • మే4న విడుదల కానున్న నా పేరు సూర్య నాయిల్లు ఇండియా
na peru surya na illu india shoopting schedule in hyderabad

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ  తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈరోజు నుంచి హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో సినిమా ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు. 14 వ తేదీ వరకు ఈ ఇంపార్టెంట్ షెడ్యూల్ జరుగుతుంది. హోళి సందర్భంగా పోస్టర్ ఇంపాక్ట్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి... ప్రపంచవ్యాప్తంగా మే 4న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. 

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... అల్లు అర్జున్, అను ఎమ్మాన్యుయేల్ జంటగా... వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ... గ్రాండియర్ గా “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈరోజు నుంచి హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. రామోజీ ఫిల్మ్ సిటీ తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ని అద్భుతమైన లోకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నాం. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో పాటు ముఖ్య తారాగణం అంతా పాల్గొంటున్నారు. ఈ నెల 14 వ తేదీ వరకు ఈ ఇంపార్టెంట్ షెడ్యూల్ జరుగుతుంది. హోళి సందర్భంగా పోస్టర్ ఇంపాక్ట్ ను రిలీజ్ చేశాం. మరో వైపు విశాల్ శేఖర్ అద్భుతమైన సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. అని అన్నారు. 

 

నటీనటులు- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్  యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు, సాంకేతిక నిపుణులు-ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), ఫైట్స్ - రామ్ లక్ష్మణ్, సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి, సంగీతం - విశాల్ - శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు, బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్, సమర్పణ - k.నాగబాబు, సహ నిర్మాత - బన్నీ వాసు, నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి, రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ

Follow Us:
Download App:
  • android
  • ios