పబ్లిక్ గా తాగుతూ పట్టుబడ్డ టాప్ హీరోయిన్ (వీడియో)

MAhira khan caught smoking again
Highlights

పబ్లిక్లో మళ్ళీ తాగేసిన బ్యూటి

బాలీవుడ్ బాద్షా షారుఖ్ పక్కన రాయిస్ చిత్రంలో హీరోయిన్గా మెరిసింది మహీరా ఖాన్. బాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవడానికి  తెగ ప్రయత్నాలు చేస్తోంది పాక్ పిల్ల రాయిస్ ఆ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు  ఈ పాపకి బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. పాక్ సినిమాల్లోనే నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఈ  పిల్ల ఓ పాడు అలవాటు కారణంగా వార్తల్లో నిలిచింది. 

దాదాపు దశాబ్దం క్రితమే పెళ్లి చేసుకున్న మహీరా ఖాన్కు ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే నటనలోనే తనదైన ప్రత్యేకత చాటి అనేక అవార్డులను కైవసం చేసుకుంది. అందుకే ఏరీకోరీ తన సినిమా కోసం ఈ పాక్ ఆంటీని పట్టుకొచ్చాడు షారుఖ్. అయితే నటనతో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో వివాదాల్లోనే అంతే పేరు తెచ్చుకుంది మహీరా. ఇంతకు ముందు పబ్లిక్గా పొగతాగడం - కురుచ దుస్తులు ధరించడంతో ముస్లింల మనోభావాలు దెబ్బతీసిందని ఆమెపై విరుచుకుపడ్డారు మతపెద్దలు. ఇప్పుడు తాజాగా ఓ అవార్డుల వేడుక కోసం న్యూయార్క్ నగరానికి వెళ్లింది ఈ హీరోయిన్. అక్కడ ఓ హోటల్ ఆవరణలో పాప పబ్లిక్గా సిగరేట్ కాల్చడం ఎవరో వీడియో తీశారు. 

వీడియో కెమెరాలను గమనించి సిగరెట్ ను దాచుకునే ప్రయత్నం చేసిందీ సుందరి. అప్పటికే అంతా రికార్డు కావడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సదరు  వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ అయిన కొద్దిసేపటికే వైరల్ కావడంతో మహీరాపై మళ్లీ విమర్శలు ఎక్కువయ్యాయి. మన మత పవిత్రతను - మత గౌరవాన్ని చెడగొడ్డేందుకే మహీరా ఇలా చేస్తోందని తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు ఆమె మతానికి చెందిన వాళ్లు.

                                 

loader