సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. సినిమాలు చూస్తున్నాడో.. లేదో అనే విషయాన్ని పక్కన పెడితే ప్రతి సినిమాపై వరుసగా ట్వీట్లు పెడుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన నాలుగు సినిమాలపై మూడు సినిమాల గురించి మహేష్ బాబు ట్వీట్ చేశాడు.

కానీ రామ్ చరణ్ సినిమా 'వినయ విధేయ రామ'పై మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు. ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమాను పొగుడుతూ ట్వీట్ చేసిన ఆయన ఆ మరుసటి రోజు విడుదలైన రజినీకాంత్ 'పేట'పై ప్రశంసల వర్షం కురిపించాడు. రీసెంట్ గా విడుదలైన 'ఎఫ్ 2' సినిమా గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడాడు.

వరుణ్, వెంకీలను పొగుడుతూ టీం అందరికీ శుభాకాంక్షలు చెప్పాడు. అయితే మధ్యలో విడుదలైన 'వినయ విధేయ రామ'ని మాత్రం పట్టించుకోలేదు. సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చిందని మహేష్ రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా ఉన్నాడని కొందరు అంటుంటే చరణ్ సినిమా చూసి ఉండరని మరికొందరు అంటున్నారు.

రామ్ చరణ్, మహేష్ లు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. అలాంటిది చరణ్ నటించిన  సినిమా చూడకుండా ఉంటారని అనుకోలేం. సినిమా చూసే ఉంటారని కానీ సినిమా బాగుందంటూ ట్వీట్ చేస్తే అభిమానుల నుండి వ్యతిరేకత ఏర్పడి ట్రోలింగ్ జరుగుతుందని సైలెంట్ అయిపోయాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు..

'వినయ విధేయ రామ' సెకండ్ డే కలెక్షన్స్!

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్