Asianet News TeluguAsianet News Telugu

Lavanya - Varuntej: వరుణ్‌ తేజ్‌తో పెళ్లి.. రిప్లై ఇచ్చిన లావణ్య

లావణ్యతో కలిసి బర్త్‌డే పార్టీ స్పెషల్‌గా చేసుకోవడానికే వరుణ్‌ బెంగళూరు వెళ్లారని, ఆమె కోసం అత్యంత ఖరీదైన డైమండ్‌ రింగ్‌ని కొనుగోలు చేశారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలు లావణ్య దగ్గరకి చేరాయి. దీంతో వాటిపై సోషల్‌ మీడియా లో  స్పందించారు లావణ్య.

Lavanya tripati clafies on marriage rumor with Varun
Author
Hyderabad, First Published Jan 20, 2022, 4:33 PM IST

 

సినీ పరిశ్రమలో రూమర్స్ కు లోటేమీ ఉండదు కానీ...కానీ కొన్ని రూమర్స్ ఆశ్చర్య అనిపిస్తాయి. నిజమో ఉత్తిదో తేల్చుకోబుద్దేయదు. అలాంటిదే వరుణ్ తేజకు ఓ స్టార్ హీరోయిన్ కు మధ్య డేటింగ్ రూమర్. అది ఇప్పుడు పెళ్లి దాకా వచ్చేసింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు లావణ్య త్రిపాఠి. మెగా హీరో వరుణ్ తేజ్ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. సరిగ్గా ఇదే రోజు ఓ  వార్త గుప్పుమంది. ఆ రూమర్స్ కు లావణ్యం కొన్ని ఫొటోలతో రిప్లై ఇచ్చారు. ఇంతకీ ఆమె ఏమంది అంటే...

మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో పెళ్లి అంటూ వస్తోన్న రూమర్స్ కు ఫొటోలతో సమాధానమిచ్చారు లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం తాను సొంతూరులో కుటుంబంతో ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. దీంతో బుధవారం ఉదయం నుంచి వస్తున్న పెళ్లి రూమర్లకు తెరపడినట్లయింది. వరుణ్‌తేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన కొన్ని ఫొటోల వల్లే ఇదంతా జరిగింది.   

వ‌రుణ్ తేజ్‌.. హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠిలు ప్రేమ‌లో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వరుణ్‌ తేజ్‌ హీరోగా చేసిన ‘మిస్టర్‌’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించారు నటి లావణ్య త్రిపాఠి. ఆ రెండు చిత్రాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ఆ మధ్య అందరూ అనుకున్నారు. అంతేకాకుండా వరుణ్‌ సోదరి నటి నిహారిక పెళ్లికి లావణ్య హాజరయ్యారు. దీంతో ఆ వార్తలకు మరింత నిజం చేసినట్లు అయ్యింది. కానీ ఆ తర్వాత ఎలాంటి రూమర్స్ లేదు. బుధవారం వరుణ్‌ పుట్టిన రోజు కావడంతో, వేడుకల కోసం వరుణ్‌ బెంగళూరు వెళ్లారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. దీంతో రూమర్ల తాకిడి మళ్లీ మొదలైంది.
 
లావణ్యతో కలిసి బర్త్‌డే పార్టీ స్పెషల్‌గా చేసుకోవడానికే వరుణ్‌ బెంగళూరు వెళ్లారని, ఆమె కోసం అత్యంత ఖరీదైన డైమండ్‌ రింగ్‌ని కొనుగోలు చేశారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలు లావణ్య దగ్గరకి చేరాయి. దీంతో వాటిపై సోషల్‌ మీడియా లో  స్పందించారు లావణ్య. దేహ్రాదూన్‌లో ఉన్నానంటూ ఫ్యామిలీతో కలిసి ఉన్నట్లు కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారామె. ప్రకృతి అందాలు తన మనసుని కట్టిపడేస్తున్నాయని ఆ ఫొటోలతోపాటు పోస్టులో రాసుకొచ్చారు. లావణ్య షేర్‌ చేసిన కొత్త ఫొటోలతో ఆమె పెళ్లి, ప్రేమ వార్తలకు మరోసారి చెక్‌ పడినట్లు అయ్యింది.

వరుణ్ తేజ్ కిప్పుడు 32 ఏళ్ళు. ఏడాది క్రితమే ఆయన సోదరి నిహారిక పెళ్లి ఘనంగా జరిగింది. దాంతో, వరుణ్ తేజ్ పెళ్లిపై ఫోకస్ పడింది.
ఈ హీరో ప్రస్తుతం ‘గని’, ‘ఎఫ్ 3’ సినిమాల్లో నటిస్తున్నాడు. కెరియర్ మంచి ఫామ్ లో ఉంది. వరుణ్ తేజ్ మరి కొత్త ప్రచారంపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios