లేటెస్ట్ సెన్సేషన్ ప్రియా వారియర్ సంచలనాలు కొనసాగుతున్నాయి. సాధారణ యూత్ మాత్రమే కాక యంగ్ హీరోల నుంచి సీనియర్ సెలెబ్రిటీల వరకు అంతా ప్రియా వారియర్ జపం చేస్తున్నారు. ఆమె ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సీనియర్ నటుడు రిషి కపూర్ తాజాగా ప్రియా వారియర్ గురించి స్పదించారు. మై డియర్ ప్రియా అంటూ సంభాషించారు. ప్రముఖ సెలెబ్రిటీలంతా ప్రియా వారియర్ గురించి ఆరాతీస్తుండడంతో ఆమె జాతీయ స్థాయిలో బిగ్ సెలేబ్రిటిగా మారిపోతోంది.

 

ఒక్క వాలు చూపుతో ప్రియా వారియర్ కన్ను గీటి ఒక్క వాలు చూపుతో అందరిని పడగొట్టేసింది. ప్రియా వారియర్ ముఖంలోని చిరునవ్వు, ఆమె హావ భావాలు యువతకు కలలో కూడా మరచిపోని విధంగా మారిపోయాయి.   

జాతీయ స్థాయిలో సెలెబ్రిటీలు ప్రియా వారియర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్అన్ని చిత్ర పరిశ్రమల వరకు ప్రియా వారియర్ ఎవరంటూ ఆరాతీయడం మొదలు పెట్టారు.

బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ ఇంకాస్త ముందడుగేసి మై డియర్ ప్రియా అంటూ సంభోదించారు. ఆమె పలికించిన హావా భావాలూ అమోఘం అంటూ కితాబిచ్చారు. రానున్న రోజుల్లో నీ ఏజ్ గ్రూప్ వారు నీ కోసం తహతహ లాడుతారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. నేనున్న రోజుల్లో ఎందుకు రాలేదు ప్రియా అంటూ సరదాగా ట్విట్టర్ లో కామెంట్ పెట్టారు.

 

ఒరు ఆడార్ లవ్ చిత్రంలోని ఒక్క వీడియోతో ప్రియా స్టార్ డమ్ ఇలా పెరిగిపోయింది. ఆ వీడియోలో ఆమె కనుసైగలతోనే అద్భుతమైన హావ భావాలని పలికించి అబ్భుర పరిచింది.