ఉపాసనను చూస్తుంటే కళ్లు తిప్పుకోలేకపోతున్నారు కదూ... ఇంతలో ఎంత మార్పు. పెళ్లప్పుడు చూసిన ఉపాసన ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న ఉపాసన ఒక్కటేనా అని సందేహం కూడా వస్తోంది. ఉపాసన కష్టపడి... ఓ డైట్ ప్రకారం సన్నగా అందంగా మారింది. చెర్రీకి తగ్గ భార్యనే అనిపించుకుంది. అప్పట్లో ఆమె అందంగా లేదని అన్న నోళ్లను ఇప్పుడు మూయించింది. 

మెగా హీరో రామ్ చరణ్ - ఉపాసన ప్రేమించుకుని పెద్దల అనుమతితో 2012లో పెళ్లి చేసుకున్నారు. మెగా కుటుంబంపై ఉన్న పిచ్చి అభిమానంతో - హీరోయిన్లను చూసిన కళ్లతోనే ఆమెను చూసారు అభిమానులు. లావుగా ఉన్న ఆమెను చూసి ఎగతాళి చేశారు. ఆమె వ్యక్తిత్వాన్ని - హోదాను - చదువును - కుటుంబాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా గేలి చేశారు. కాని ఇలాంటి ట్రాల్స్ పై చాలా గౌరవంగా మాట్లాడింది ఉపాసన. వారిపై ఎక్కడా దురుసుగా నోరుజారలేదు. తన ప్రయత్నంతో పట్టుదలతో ఇదిగో ఇప్పుడు మెరుపు తీగలా తయారై... హీరోయిన్లకే పోటీగా మారింది. క్రిటిసిజంకు సరైన కౌంటర్ అంటే మాటలతో కాదు.. చేతలతోనే చూపించాలన్నట్లుంది ఉపాసన్ కొత్త లుక్. 

ఉపాసన కచ్చితమైన డైట్ ను పాటించింది. ఆ డైట్ ప్లాన్ ను కూడా ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఉపాసనక్లీన్ వీక్ పేరుతో వారం రోజుల పాటూ కేవలం ఆకుకూరలు - బఠానీలు - దోసకాయలు - క్యారెట్లు మాత్రమే తింది. ఆ వీక్ పూర్తవ్వడంతో ట్విట్టర్ లో ఓ ఫోటోను పోస్టు చేసింది. ఆ ఫోటోలో ఉపాసనను చూసి కొత్త హీరోయిన్ అనుకున్నారు కొందరు. మొత్తమ్మీద అందంలో కూడా చెర్రీ భార్య అనిపించుకుంది ఉప్స్.