తాను విజయవాడలోనే చదువుకున్నానని కానీ ఒక్కసారి కూడా కనకదుర్గమ్మను దర్శించుకోలేదన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. కొండా సురేఖ వల్లే ఇన్నాళ్లకు గుడికి వచ్చినట్లు ఆర్జీవీ తెలిపారు.
విజయవాడ కనకదుర్గ (vijayawada kanakadurgamma ) అమ్మవారిని "కొండా" చిత్ర బృందం (konda movie) దర్శించుకుంది. దర్శకులు రాంగోపాల్ వర్మ (ram gopal varma), మాజీ మంత్రి కొండా సురేఖ (konda surekha) , నిర్మాత సుష్మిత , నటీనటులు అదిత్ అరుణ్, ఐరా మోర్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ప్రధానార్చకులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ .. తాను విజయవాడలో ఇంజనీరింగ్ చదువుకున్నట్లు తెలిపారు. కాలేజీ రోజుల్లో ఒక్కసారి కూడా దుర్గమ్మ దర్శనానికి రాలేదని ఆర్జీవీ తెలిపారు. కొండా సురేఖ దంపతుల వలన అమ్మవారిని దర్శించుకున్నానని వర్మ వ్యాఖ్యానించారు. కొండా దంపతుల భక్తి పారవశ్యం తనను ఆకర్షించిందని.. కొండా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నానని.. సినిమా హిట్ కావాలని కోరుకున్నాను' అని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.
అనంతరం మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఆర్జీవీ దేవుడు పంపిన దూతగా వచ్చి తమ బయోపిక్ తీశారని ప్రశంసించారు. తమ బయోపిక్ సినిమాలో కేవలం 10 శాతం మాత్రమే ఉందని... కానీ మొత్తం మా బయోపిక్ తీయాలంటే వెబ్ సిరీస్ సరిపోదని సురేఖ అన్నారు. ఏ శత్రువుకి రాని అనుభవాలు తాము భరించామని, తన పాత్ర చేయడానికి హీరోయిన్ బాగా కష్టపడిందని ఆమె ప్రశంసించారు. కొండా మూవీ బయటకు వచ్చాక మీరే చెప్తారని .. సినిమా విజయవంతం అయ్యాక అమ్మవారి దర్శనానికి మళ్లీ వస్తామని సురేఖ పేర్కొన్నారు.
ఇకపోతే.. వివాదాస్పద బయోపిక్ మూవీస్ తీయ్యడంతో రామ్ గోపాల్ వర్మకు ఎవరూ సాటి రారు. ఎవరికి భయపడకుండా.. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా తనకు అనకున్నది అనుకున్నట్టు తీస్తుంటాడు వర్మ. ఈ క్రమలోనే వరంగల్ కు చెందిన సీనియర్ పొలిటికల్ దంపతులు కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా 'కొండా' సినిమాను రూపొందించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ (Irra Mor) నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో యాపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. కొండా సుష్మితా పటేల్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేళలకు జూన్ 23న సినిమాను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్, మొదటి ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్, డైలాగ్స్, సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. మరోవైపు పబ్లిక్ ఐకాన్ అయిన కొండా మురళీ, కొండా సురేఖ దంపుతల జీవిత చరిత్ర కావడంతో ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది. గతంలో సినిమా ప్రమోషన్స్ ను గట్టిగానే చేసినా సినిమాను మాత్రం విడుదల చేయలేదు. మళ్లీ తాజాగా సినిమాను రిలీజ్ బోతున్నామంటూ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ‘కొండా’ నుంచి రెండో ట్రైలర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్.
గతంలో రిలీజ్ అయిన ట్రైలర్ వన్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్సే దక్కించింది. ముఖ్యంగా యువకులను రెచ్చగొట్టేలా కొన్ని సన్నివేశాలను ట్రైలర్ లో ఉంచడం పట్ల కొండా మురళీ జీవిత చరిత్రను సినిమా ద్వారా తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. తాజాగా రిలీజ్ చేసిన Konda Trailer 2 కూడా భయంకరంగానూ, ఆలోచనా జనితంగా ఉంది. అయితే ఈ ట్రైలర్ లో కొండాను మరింత వైలెంట్ గా, అగ్రెసివ్ గా చూపించారు. ‘విపరీత పరిస్థితుల నుంచి పుట్టిన వ్యక్తే కొండా మురళీ’ అంటూ చెప్పే డైలాగ్స్ కథపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. తను స్టూడెంట్ దశ నుంచి లీడర్ స్థాయికి ఎదిగే క్రమాన్ని చూపించారు. ఈక్రమంలో రక్తపాతం ఎక్కువగానే కనిపిస్తోంది. అలాగే కొండా సురేఖ, కొండా మురళీ లవ్ ట్రాక్ కు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
