Asianet News TeluguAsianet News Telugu

మహానటిలో ఈ టాలెంట్‌ కూడా ఉందా..?

ఈ నెల 22 విజయ్‌ తన 46వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ వయోలిన్‌ ప్లే చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. విజయ్‌ తాజా చిత్రం మాస్టర్‌ సినిమాలోని పాటను వయోలిన్‌ మీద ప్లే చేసిందీ భామ. కీర్తి, విజయ్‌కి జోడిగా భైరవ, సర్కార్ సినిమాల్లో నటించింది. అందుకే విజయ్‌తో ఉన్న క్లోజ్‌నెస్‌తో మ్యూజికల్‌ విషెస్‌ చెప్పిందీ బ్యూటీ.

Keerthy Suresh Played Her Birthday Wish For Vijay On A Violin
Author
Hyderabad, First Published Jun 24, 2020, 8:55 AM IST

మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అందాల భామ కీర్తీ సురేష్‌. అలనాటి అందాల తార సావిత్రి కథతో తెరకెక్కిన మహానటి సినిమా కీర్తి సురేష్‌కు ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. మహానటి తరువాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న కీర్తి తెలుగుతో పాటు తమిళ్‌లోనూ కమర్షియల్ హీరోయిన్‌గానూ పేరు తెచ్చుకుంటోంది. తాజాగా డిజిటల్‌ ప్లాట్‌ఫాంలోనూ పెంగ్విన్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన కీర్తి తనలోని మరో టాలెంట్‌ను అభిమానులకు పరిచయం చేసింది. కోలీవుడ్‌ టాప్‌ హీరో విజయ్‌ బర్త్‌ డే సందర్భంగా మ్యూజికల్‌గా విషెస్‌ తెలిపింది కీర్తి. ఈ నెల 22 విజయ్‌ తన 46వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ వయోలిన్‌ ప్లే చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. విజయ్‌ తాజా చిత్రం మాస్టర్‌ సినిమాలోని పాటను వయోలిన్‌ మీద ప్లే చేసిందీ భామ. కీర్తి, విజయ్‌కి జోడిగా భైరవ, సర్కార్ సినిమాల్లో నటించింది. అందుకే విజయ్‌తో ఉన్న క్లోజ్‌నెస్‌తో మ్యూజికల్‌ విషెస్‌ చెప్పిందీ బ్యూటీ.

తాను వయోలిన్‌ ప్లే చేస్తున్న వీడియోతో పాటు `లైఫ్‌ ఈజ్‌ వెరీ షార్ట్‌ నన్‌బా.. ఆల్ వేస్‌ బీ హ్యాపీ` అంటూ క్యాపన్‌ ఇచ్చింది కీర్తి. దీంతో ఒక్కసారిగా కీర్తి పోస్ట్‌కు కామెంట్స్‌ వెళ్లువెత్తాయి. కీర్తి లోని టాలెంట్‌ను పొగుడుతూ విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిలో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కోలీవుడ్ బ్యూటీ మాళవికా మోహన్‌ కీర్తి లోని ఈ స్పెషల్ టాలెంట్‌ అమేజింగ్ అంటూ కామెంట్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios