Asianet News TeluguAsianet News Telugu

అంత డబ్బు నా దగ్గర లేదు.. జాన్వీ కపూర్ కామెంట్స్!

సహజంగా హీరోయిన్లు వేసిన బట్టలు మళ్లీ వేసుకోరు. ఫ్యాషన్ విషయంలో చాలా శ్రద్ధ చూపుతుంటారు.

jhanvi kapoor Gives Epic Reply To Trolls
Author
Hyderabad, First Published Apr 8, 2019, 3:29 PM IST

సహజంగా హీరోయిన్లు వేసిన బట్టలు మళ్లీ వేసుకోరు. ఫ్యాషన్ విషయంలో చాలా శ్రద్ధ చూపుతుంటారు. అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ తో కనిపించాలని ఆరాటపడుతుంటారు.

అయితే ఈ మధ్యకాలంలో నటి జాన్వీ కపూర్ తన బట్టలు రిపీట్ చేస్తుందని.. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ''వేసిన బట్టలే మళ్లీ వేసుకున్తున్నావ్.. ఇది హీరోయిన్ లక్షణం కాదు.. ఏంటా గెటప్'' అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విమర్శలపై స్పందించింది. అందరికీ ఆనందపరచడం, మెప్పించడం ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చని చెప్పింది. డ్రెస్సింగ్ గురించి తనపై వస్తోన్న విమర్శలను సీరియస్ గా తీసుకోలేనని చెప్పింది. నటించడం తన  ప్రొఫెషన్ అని దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తా అని చెప్పింది.

బయట ఎలా కనిపించాలనేది..? ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది..? తన ఇష్టమని స్పష్టం చేసింది. ప్రతీరోజూ కొత్త బట్టలు వేసుకునేంత డబ్బు తను ఇంకా సంపాదించడం లేదని నవ్వుతూ తనపై ట్రోల్స్ చేస్తున్న వారికి ధీటుగా బదులిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'కార్గిల్ గర్ల్' అనే సినిమాలో నటిస్తోంది. అలానే 'తక్త్' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios