Asianet News TeluguAsianet News Telugu

వేరే లెవల్ లో అఖండ క్రేజ్.. హిందీ ఆడియన్స్ డిమాండ్ చూశారా, ఇద్దరు బడా హీరోల పోటీ

అఖండ చిత్రం నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే బ్లాస్టింగ్ హిట్ అని చెప్పాలి. కరోనా కష్టకాలంలో విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురింపజేస్తూ తిరుగులేని విజయంగా నిలిచింది.

Hindi audience demanding to remake Akhanda
Author
Hyderabad, First Published Jan 25, 2022, 9:07 PM IST

అఖండ చిత్రం నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే బ్లాస్టింగ్ హిట్ అని చెప్పాలి. కరోనా కష్టకాలంలో విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురింపజేస్తూ తిరుగులేని విజయంగా నిలిచింది. దర్శకుడు బోయపాటి నందమూరి అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు. బాలయ్యని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారా అంతకు మించేలా పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశాడు. 

యాక్షన్, ఎమోషన్, బాలయ్య బాడీ లాంగ్వేజ్, గెటప్ ఇలా ప్రతి అంశంలో అఖండ చిత్రం మెప్పించింది. థియేటర్స్ లో తిరుగులేని విజయం నమోదు చేసుకున్న తర్వాత ప్రస్తుతం అఖండ మూవీ ఓటిటిలో దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా బాహుబలి తర్వాత సౌత్ సినిమా, నార్త్ సినిమా అనే భేదాలు తొలిగిపోయాయి. సౌత్ నుంచి వరుసగా పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతుండడంతో నార్త్ ఆడియన్స్ కి తెలుగు సినిమాలపై ఆసక్తి పెరిగిపోతోంది. 

అఖండ చిత్రం కూడా రీసౌండింగ్ హిట్ నమోదు చేసుకోవడంతో హిందీ ఆడియన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అర్జెంట్ గా తమకు అఖండ హిందీ వెర్షన్ కానీ, హిందీ రీమేక్ కానీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. బాలయ్య అఘోర గెటప్ వారిని అంతలా ఆకర్షిస్తోంది. 

అఖండ మూవీ ఫర్ సనాతన్ ధర్మ అంటూ హిందీ ఆడియన్స్ ఈ చిత్ర రీమేక్ కావాలని కోరుతున్నారు. తెలుగు హిట్ చిత్రాల హిందీ వెర్షన్స్ కి యూట్యూబ్ లో వందల మిలియన్ల వ్యూస్ నమోదవుతుండటం చూస్తూనే ఉన్నాం. అదే తరహాలో అఖండ చిత్రం కోసం కూడా హిందీ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. 

తెలుగులో విజయం సాధించిన సినిమాలపై బాలీవుడ్ మేకర్స్ వెంటనే కన్నేస్తున్నారు. అఖండ మూవీపై కూడా బాలీవుడ్ స్టార్ హీరోల కన్ను పడింది. అఖండ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి హీరోలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios