Asianet News TeluguAsianet News Telugu

#God Father: `గాడ్‌ఫాదర్‌` ఫస్ట్ డే కలెక్షన్లు.. స్టామినా చూపించిన మెగాస్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన  `గాడ్‌ ఫాదర్‌` చిత్రం దసరా పండగ  సందర్భంగా విడుదలై అలరిస్తుంది.  ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా  సినిమా సత్తా  చాటింది. 

god father movie firstday collections chiranjeevi showing his power
Author
First Published Oct 6, 2022, 1:55 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సినిమా `గాడ్‌ ఫాదర్‌`. మోహన్‌  రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా సందర్భంగా బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. సల్మాన్‌ ఖాన్‌, సత్యదేవ్, నయనతార కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలైన నుంచి మిక్స్ డ్‌ టాక్‌ తెచ్చుకుంటోంది. ఈ  చిత్రం `లూసీఫర్‌`కి రీమేక్‌. ఆ సినిమాతో కంపేర్‌ చేయడంతో నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. 

ఓపెనింగ్స్ మాత్రం గట్టిగానే తెచ్చుకుంది `గాడ్‌ ఫాదర్‌`. ఫస్ట్‌ డే కలెక్షన్లని చిత్ర బృందం విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మెగాస్టార్‌ తన సత్తా చాటారు. ఓపెనింగ్‌ గట్టిగానే తెచ్చుకుంది. రూ.38 కోట్లు రాబట్టింది. ముందుగానే అడ్వాన్స్ బుకింగ్‌ ఉండటంతో ఈ చిత్రానికి ఈ స్థాయి కలెక్షన్లు దక్కాయని చెప్పొచ్చు. చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత మెగాస్టార్‌కి హిట్‌ దక్కిందని చెప్పొచ్చు. బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటున్నారు.  

దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కలెక్షన్లు ఉండటం విశేషం. ఈ వీకెండ్స్ లో ఇదే జోరుకొనసాగితే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. దీంతో సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిపోయింది. ఇక సినిమా పరంగా కొంత నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకున్న విషయం తెలిసిందే. సల్మాన్‌ పాత్ర సెట్‌ కాలేదంటున్నారు. కానీ పండగ సీజన్‌ కావడంతో సినిమా బాగానే ఆడే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల టాక్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios