Asianet News TeluguAsianet News Telugu

కంగారు పెడుతున్న 'సాహో'.. అక్కడ 'అజ్ఞాతవాసి' రేంజ్ మాత్రమేనా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యువి క్రియేషన్స్ నిర్మాతలు దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు రూపొందించారు. 

Expectations on Saaho US premier show collections
Author
Hyderabad, First Published Aug 29, 2019, 5:21 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యువి క్రియేషన్స్ నిర్మాతలు దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు రూపొందించారు. 

తెలుగు, హిందీ భాషల్లో సాహో చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. కానీ ఓవర్సీస్ మార్కెట్ మాత్రం బయ్యర్లకి కంగారుపెడుతున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో సాహో చిత్ర థియేట్రికల్ రైట్స్ 43 కోట్లకు అమ్ముడయ్యాయి. దీనితో బయ్యర్లు 3 మిలియన్ డాలర్ల వరకు ప్రీమియర్ షోల ద్వారానే వసూలవుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే పరిస్థితి అలా కనిపించడం లేదు. 

బాహుబలి 2 యుఎస్ ప్రీమియర్స్ ద్వారా ఏకంగా 2.4 మిలియన్ డాలర్స్ రాబట్టింది. సాహో చిత్ర వసూళ్లు ఆ స్థాయిలో ఉండకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్, యుఎస్ లో సాహోపై ఉన్న బజ్ ప్రకారం 'అజ్ఞాతవాసి' చిత్రం స్థాయిలో ప్రీమియర్ షో వసూళ్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అజ్ఞాతవాసి చిత్రం ప్రీమియర్ షోల ద్వారా 1.5 మిలియన్ డాలర్స్ రాబట్టింది. 

బాహుబలి 2 తర్వాత అత్యధిక ప్రీమియర్ వసూళ్లు సాధించిన చిత్రంగా అజ్ఞాతవాసి నిలిచింది. యుఎస్ లో ప్రీమియర్ షోలతోనే 1 మిలియన్ డాలర్ వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో బాహుబలి 2(2.4 మిలియన్), అజ్ఞాతవాసి(1.5 మిలియన్), బాహుబలి 1(1.3 మిలియన్), ఖైదీ నెం 150(1.2 మిలియన్), స్పైడర్( 1 మిలియన్) చిత్రాలు ఉన్నాయి. 

ఓవర్సీస్ లో సాహో వసూళ్లు ఆశించిన స్థాయిలో రావాలంటే ప్రీమియర్ షోల టాక్ చాలా కీలకం కానుంది. గురువారం రోజే యుఎస్ ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. 

ఇవి కూడా చదవండి : 

నైజం కింగ్ ప్రభాస్: మహేష్ - పవన్ ల కంటే హై రేంజ్ లో..

'సాహో' సినిమా ఎందుకు చూడాలంటే..?

సాహో దెబ్బకు 'అవెంజర్స్' రికార్డ్ అవుట్ ?

సాహోపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ప్రభాస్ సినిమా అయితే ఏంటి!

సాహో: బాలీవుడ్ బ్యూటీ రెమ్యునరేషన్ ఎంతంటే?

అమెరికాలో 'సాహో' టికెట్ రేట్.. వర్కవుట్ అవుతుందా..?

‘సాహో’ మొదటి షో ఎక్కడ,ఎన్నింటికి?

‘సాహో’నిర్మాతలకు హైకోర్టు నోటీసులు జారీ!

సచిన్ ని ఉదాహరణగా చెప్పి తన గౌరవం పెంచుకున్న ప్రభాస్!

సాహో 500 కోట్లు సాధిస్తుందా ?.. హిందీలో పరిస్థితి ఇది!

అందుకే నాలుగు సినిమాలు ఢమాల్.. ఫ్లాప్స్ పై ప్రభాస్!

‘సాహో’ఫస్ట్ టార్గెట్ ఆ తెలుగు డైరక్టర్ సినిమానే?

హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ప్రభాస్ గోల్డెన్ ఛాన్స్

'సాహో' ప్రీరిలీజ్ టాక్.. మాస్ కి ఎక్కదా..?

‘సాహో’ సక్సెస్ అయితేనే...తేల్చి చెప్పిన ప్రభాస్!

బాహుబలి నా ముందు మోకాళ్లపై కూర్చున్నాడు.. సాహో విలన్!

Follow Us:
Download App:
  • android
  • ios