యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్ర సందడి విడుదలకు ముందే మొదలయింది. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఈ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 300 కోట్ల బడ్జెట్ లో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొని ఉంది. 

పలు ఇంటర్వ్యూలలో ప్రభాస్ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫెయిల్యూర్స్ గురించి ప్రభాస్ మాట్లాడాడు. కష్టపడి సినిమా చేస్తాం కాబట్టి రిజల్ట్ పై తప్పనిసరిగా టెన్షన్ ఉంటుంది. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా రెండు రోజుల్లో దానినుంచి బయటకు వచ్చేస్తానని ప్రభాస్ తెలిపాడు. 

నా ఓ సమయంలో వరుసగా నాలుగు ఫ్లాప్స్ ఎదురయ్యాయి. పౌర్ణమి నుంచి నాలుగు చిత్రాలు ఢమాల్ అయ్యాయి. ఆ టైం నేను చేసిన తప్పులు ఏంటనే ఒకసారి ఆలోచించినట్లు ప్రభాస్ తెలిపాడు. ఫెయిల్యూర్ లోనే మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చని ప్రభాస్ తెలిపాడు. వరుసగా నాలుగు చిత్రాలు పరాజయం చెందిన టైంలో మనం ఎంత కష్టపడినా సారైనా కథ లేకపోతే వృధా అని తెలుసుకున్నా. 

సినిమాకు కథే మాస్టర్. ఆ టైం లో నాకు అనుభవం లేదు. అందుకే కథల ఎంపికలో పొరపాట్లు చేశా అని ప్రభాస్ తెలిపాడు. ప్రేక్షకుల అభిరుచు మారుతున్న సమయంలో వారికి నచ్చే కథలు ఎంచుకోవడం చాలా కష్టం. ఉదాహరణకు అర్జున్ రెడ్డి, రంగస్థలం చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయని ప్రభాస్ తెలిపాడు.