హిట్ అయ్యిన సినిమాలకు సీక్వెల్ తీయటం కామనే. అయితే ఈ విషయంలో  క్లారిటీగా ఉంటున్నారు దర్శక,నిర్మాతలు. ముందుగానే సీక్వెల్ కు తగ్గ క్లూలు సినిమాలో ఇస్తున్నారు. దాంతో ఎప్పుడైనా ఈ సినిమాకు సీక్వెల్ కావాలనుకుంటే ఈజీగా ప్లాన్ చేసేసుకోవచ్చు. అలాంటి క్లూనే సాహో సినిమా చివర్లో ప్లాన్ చేసారని తెలుస్తోంది. ఎండ్ టైటిల్స్ దగ్గర మళ్లీ వస్తా అనే తరహాలో డైలాగుతో ముగిస్తారని వినికిడి. ఈ నేపధ్యంలో ప్రభాస్ ని మీడియా వాళ్లు సాహో సీక్వెల్ విషయమై కదిపితే ఆయన ఏమన్నారో చూడండి.

ప్రభాస్ మాట్లాడుతూ....అన్నీ కుదిరితే తప్పకుండా  ‘సాహో’కి సీక్వెల్‌ ఉంటుంది. కానీ, వెంటనే ఉండదు.  అది `సాహో` రిజ‌ల్ట్‌పై ఆధార‌ప‌డి ఉంది. సాహోకి వ‌చ్చిన రెస్పాన్స్ చూసి సీక్వెల్ విష‌యాన్ని ఆలోచిస్తాం. మధ్యలో రెండు మూడు చిన్న సినిమాలు చేసి ఆ తర్వాత చేస్తా. అప్పుడు కూడా సీక్వెల్‌తో పాటు మరో సినిమా ప్యారలల్‌గా చేస్తా అని చెప్పుకొచ్చారు . 

ప్రభాస్ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మించిన సినిమా ‘సాహో’.   శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించింది. జాకీష్రాఫ్, మందిరాబేడీ, నీల్ నీతేశ్ ముఖ్, అరుణ్ విజయ్, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూ.350 కోట్లతో నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 30న పలు భాషల్లో విడుదల కానుంది.జిబ్రాన్‌ నేపథ్య సంగీత దర్శకుడు.