యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో రిలీజ్ సమయం దగ్గరపడే కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సాహో చిత్రం భారీ స్థాయిలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రభాస్ నటించిన యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

నార్త్ అభిమానుల్లో ప్రభాస్ ఫీవర్ నెలకొంది. బాలీవుడ్ ఖాన్స్ ని మించేలా ప్రభాస్ క్రేజ్ నెలకొని ఉంది. బాహుబలి చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాడు. అమరేంద్ర బాహుబలిగా చెరగని ముద్ర వేశాడు. సాహో చిత్రంతో ఆ క్రేజ్ మరింతగా ఎక్కువవుతోంది. దీని గురించి ఇటీవల ప్రభాస్ కు ఓ ప్రశ్న ఎదురైంది. 

బాలీవుడ్ ఖాన్స్ ని మించిపోయారు కదా అని ఇంటర్వ్యూలో ప్రభాస్ కు ప్రశ్న ఎదురు కాగా అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానంతో ప్రభాస్ తనపై గౌరవాన్ని కూడా రెట్టింపు చేసుకున్నాడు. క్రికెట్ లో సచిన్ ది బెస్ట్.. ఎవరైనా కొత్త క్రికెటర్ వచ్చి 200 పరుగులు సాధిస్తే సచిన్ ని మించిపోయినట్లా అని ప్రశ్నించాడు. 

నేను కూడా అంతే.. ఇక్కడ ఖాన్స్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు.. వాళ్ళని నేనెలా మించిపోతాను అని ప్రభాస్ ప్రశ్నించాడు. ప్రభాస్ సమాధానంపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి : 

సాహో 500 కోట్లు సాధిస్తుందా ?.. హిందీలో పరిస్థితి ఇది!

అందుకే నాలుగు సినిమాలు ఢమాల్.. ఫ్లాప్స్ పై ప్రభాస్!

‘సాహో’ఫస్ట్ టార్గెట్ ఆ తెలుగు డైరక్టర్ సినిమానే?

హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ప్రభాస్ గోల్డెన్ ఛాన్స్

'సాహో' ప్రీరిలీజ్ టాక్.. మాస్ కి ఎక్కదా..?

‘సాహో’ సక్సెస్ అయితేనే...తేల్చి చెప్పిన ప్రభాస్!