సాహో సినిమా ఆడియెన్స్ ని ప్రతి నిమిషం ఆకట్టుకోవాలని చిత్ర యూనిట్ ఆలోచించిన విధానం మాటల్లో చెప్పలేనిది. ఎన్నో నిర్ణయాల్లో ఊహించని మార్పులు చూడాల్సి వచ్చిందని అర్ధమవుతోంది. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో సాహో యూనిట్గ్ ఎలాంటి మార్పులు చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

ఇక జాక్వలిన్ ఫెర్నాండేజ్ సినిమాలో ఒక ప్రత్యేక పాటలో కనిపించిన విషయం తెలిసిందే. ఏకధాటిగా అందాలను ఆరబోసిన అమ్మడికి ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా గట్టిడ్డే. మొదట ఈ సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ ని అనుకున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఆమె 2కోట్ల రెమ్యునరేషన్ ని అడగడంతో అదే రేటుకు బాలీవుడ్ బ్యూటీని రప్పిస్తే బెటర్ అని నిర్మాతలు జాక్వలిన్ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. 

సాహో లాంటి బారి బడ్జెట్ సినిమా కావడంతో జాక్వలిన్ అంతకంటే ఎక్కువగా డిమాండ్ చేయలేదని తెలుస్తోంది. మొత్తానికి కాజల్ కి రావాల్సిన 2కోట్ల బేరం బాలీవుడ్ బేబీకి షిఫ్ట్ అవ్వడంతో ఈ న్యూస్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మరి ఈ సినిమాకి ఆ స్పెషల్ సాంగ్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.