ప్రస్తుతం ఇండియా మొత్తం సాహో ఫీవర్ కనిపిస్తోంది. సాహో సాధించబోయే సంచలనాల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో అన్ని భాషల నుంచి ప్రముఖ నటులు నటించారు. అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, చంకీ పాండి, మందిర బేడీ, ఎవిలిన్ శర్మ, జాకీ ష్రాఫ్ ఇలా పలువురు నటులు కీలక పాత్రల్లో నటించారు. 

ప్రస్తుతం ఇండియా మొత్తం సాహో ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సాహోలో విలన్ పాత్రలో నటించిన చంకీ పాండి బాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రభాస్, తనకు మధ్య వచ్చే ఓ ఆసక్తికర సన్నివేశం గురించి వివరించారు. 

ఓ సన్నివేశంలో ప్రభాస్ నా ముందు మోకాళ్లపై కూర్చుంటాడు. ఆ సమయంలో బాహుబలి నా ముందు మోకరిల్లినట్లు అనిపించింది అని చంకీ పాండి తెలిపారు. ప్రభాస్ లో ఉన్న వినయం మరే స్టార్ లోనూ చూడలేదు. బాలీవుడ్ నటులు సెట్స్ కు వచ్చి షూటింగ్ ముగించుకుని హోటల్ కు వెళ్లెవరకూ ప్రభాసే అంతా దగ్గరుండి చూసుకునేవాడు అని చంకీ పాండి వివరించారు. 

ఇవి కూడా చదవండి : 

సచిన్ ని ఉదాహరణగా చెప్పి తన గౌరవం పెంచుకున్న ప్రభాస్!

సాహో 500 కోట్లు సాధిస్తుందా ?.. హిందీలో పరిస్థితి ఇది!

అందుకే నాలుగు సినిమాలు ఢమాల్.. ఫ్లాప్స్ పై ప్రభాస్!

‘సాహో’ఫస్ట్ టార్గెట్ ఆ తెలుగు డైరక్టర్ సినిమానే?

హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ప్రభాస్ గోల్డెన్ ఛాన్స్

'సాహో' ప్రీరిలీజ్ టాక్.. మాస్ కి ఎక్కదా..?

‘సాహో’ సక్సెస్ అయితేనే...తేల్చి చెప్పిన ప్రభాస్!