Asianet News TeluguAsianet News Telugu

#Ahimsa :తేజ ‘అహింస’టీజర్..ఇలా ఉందేంటి


ఒక ఇంగ్లీష్ (ముద్దు) ఇవ్వు..పోనీ తెలుగు ఇవ్వు..అని హీరోయిన్ అడుగుతుంటే..నేనివ్వ‌ను..నిన్ను అస్స‌లు ఇవ్వ‌నివ్వ‌ను అని హీరో అంటున్నాడు. హీరోహీరోయిన్ల మ‌ధ్య సాగే ట్రాక్‌తో మొద‌లైన టీజ‌ర్‌.. 

Director Teja Ahimsa Teaser released
Author
First Published Oct 6, 2022, 12:55 PM IST


ఒకప్పుడు తన మేకింగ్ తో, యూత్ ని ఆకట్టుకునే ప్రేమకథలతో ట్రెండ్ సెట్ చేసారు డైరక్టర్ తేజ. కాలం మారింది. ఆయన కెరీర్ లో వెనకబడ్డారు. ఆయన సినిమాలు భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావటం లేదు. అయితే ఈ సారి మరో ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దర్శకుడు తేజ. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘అహింస’. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు  దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా పరిచయమవుతున్నారు. దీనిలో గీతికా తివారీ  హీరోయిన్. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. 
 

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  తేజ  స్టైల్ లో నేటి యూత్ ని ఆకట్టుకునే విధంగా అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చిత్ర టీమ్  తెలిపింది.అయితే టీజర్ చూస్తూంటే అదేమీ కనపించటం లేదు. తేజ పాత స్కూల్ లోనే ,పాత ఫార్మెట్ లోనే సినిమా ఉన్నట్లు టీజర్ చూస్తుంటే అనిపిస్తోంది.

ఒక ఇంగ్లీష్ (ముద్దు) ఇవ్వు..పోనీ తెలుగు ఇవ్వు..అని హీరోయిన్ అడుగుతుంటే..నేనివ్వ‌ను..నిన్ను అస్స‌లు ఇవ్వ‌నివ్వ‌ను అని హీరో అంటున్నాడు. హీరోహీరోయిన్ల మ‌ధ్య సాగే ట్రాక్‌తో మొద‌లైన టీజ‌ర్‌..ఫ్యామిలీ, ఎమోష‌న్స్, యాక్ష‌న్ పార్టుతో సాగుతూ..సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.

ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై పీ కిర‌ణ్ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన అభిరామ్ స్ట‌న్నింగ్ లుక్ ఒక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. జ‌యం సినిమాతో తేజ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన స‌దా ఈ చిత్రంలో కీ రోల్ చేస్తోంది. న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని మెయిన్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

ప్రస్తుతం ఇది నిర్మాణాంతర పనుల దశలో ఉంది. విడుదల తేదీని తర్వలోనే ప్రకటించనున్నారు. రజత్‌ బేడీ, సదా, రవి కాలే, కమల్‌ కామరాజు తదితరులు దీనిలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పి.కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇటీవల విడుదలైన ‘నీతోనే నీతోనే నేనెపుడూ..’ అనే పాట ప్రేక్షకాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios