Asianet News TeluguAsianet News Telugu

Dil Raju:`రౌడీ బోయ్స్‌` నష్టమెంత? ఎంత పెట్టారు

తన సోదరుడు కుమారుడు హీరో కావటంతో... ఈ సినిమా కోసం దిల్ రాజు బాగానే ఖ‌ర్చు పెట్టారు. ఆశీష్ తొలి సినిమానే అయినా బ‌డ్జెట్ విష‌యంలో వెనుకడుగు వేయ‌లేదు. 20 కోట్ల‌ు పైగానే ఈ సినిమాపై పెట్టినట్లు సమాచారం.

Dil Raju Rowdy boys movie collections poor
Author
Hyderabad, First Published Jan 24, 2022, 1:25 PM IST


టాలీవుడ్లోకి కొత్తగా మరో వారసుడు అడుగు పెట్టాడు. ఆ కుర్రాడే ఆశిష్ రెడ్డి. దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడైన ఈ కుర్రాడు హీరోగా పరిచయమైన సినిమా.. రౌడీ బాయ్స్. ‘హుషారు’ ఫేమ్ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాలో విషయం లేదని మొదటి రోజే తేలిపోయింది. దాంతో ఎంత నష్టం ఉండచ్చు..ఎంత పెట్టుబడి పెట్టారు అనేది ట్రేడ్ లో చర్చగా మారింది.

అందుతున్న సమాచారం మేరకు...తన సోదరుడు కుమారుడు హీరో కావటంతో... ఈ సినిమా కోసం దిల్ రాజు బాగానే ఖ‌ర్చు పెట్టారు. ఆశీష్ తొలి సినిమానే అయినా బ‌డ్జెట్ విష‌యంలో వెనుకడుగు వేయ‌లేదు. 20 కోట్ల‌ు పైగానే ఈ సినిమాపై పెట్టినట్లు సమాచారం. సంక్రాంతి సీజ‌న్‌, పైగా యూత్ ఫుల్ మూవీ కాబ‌ట్టి.. కలెక్షన్స్ బాగానే వ‌స్తాయ‌ని ఆశించారు. కానీ... రిజల్ట్ రివ‌ర్స్‌కొట్టింది. సినిమాలో విష‌యం లేక‌పోవ‌డంతో... ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకుంది.

అదే సమయంలో  బంగార్రాజు దూసుకుపోవడం వ‌ల్ల ఆ సినిమా ముందు రౌడీ బోయ్స్ వెల‌వెల‌బోయింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాకు పెట్టిన ఖర్చులో సగం కూడా అంటే  రూ10 కోట్లమైలు రాయికి కూడా చేరుకోలేక‌పోయింది.  దిల్ రాజు లాంటి నిర్మాత‌కు రూ.10 కోట్లు పోవ‌డం పెద్ద విషయమేమీ కాకపోయినా తొలి సినిమానే ఫ్లాఫ్ ఖాతాలో చేరిపోయింది.

 ఎందరో స్టార్లకు పెద్ద హిట్లు ఇచ్చిన దిల్ రాజు.. తన సోదరుడి కొడుకు సినిమాకు ‘రౌడీ బాయ్స్’ లాంటి కథను ఎంచుకోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం. హర్ష తీసిన ‘హుషారు’ హిట్టయింది కదా అని కాలేజ్ లవ్ స్టోరీ అనగానే టెంప్ట్ అయిపోయి ఓకే చేసినట్లుంది తప్ప.. తనకు తాను సెట్ చేసుకున్న బెంచ్ మార్క్ గురించి మాత్రం రాజు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు.

ఎన్నో సార్లు చూసిన రొటీన్ కథ.. మామూలు సన్నివేశాలతో సాగిపోయిన ‘రౌడీ బాయ్స్’ ప్రేక్షకులను నిరాశకే గురి చేస్తుంది. ‘హుషారు’ తరహాలో ప్రథమార్ధంలో వచ్చే కొన్ని క్రేజీ యూత్ ఫుల్ ఎపిసోడ్లు.. హీరో హీరోయిన్ల పెర్ఫామెన్స్.. రొమాన్స్ మినహాయిస్తే ‘రౌడీ బాయ్స్’లో చెప్పుకోవడానికి ఏమీ లేదు.

ఇక ఇప్పుడు దిల్ రాజు ...ఓటీటీ, శాటిలైట్ రూపంలో..తను పెట్టిన పెట్టుబడిని రాబ‌ట్టుకుంటాడు. కాక‌పోతే.. ఆశిష్ కి తొలి సినిమాతోనే హిట్టు ఇవ్వాల‌న్న కోరిక నెర‌వేర‌లేదనే బాధే ఉండిపోతుంది.  భారీ ఎత్తున ప్ర‌మోష‌న్లు క‌ల్పించినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. దాంతో ఆశిష్ రెండో సినిమా విష‌యంలో ఇప్ప‌టి నుంచే పనులు ప్రారంభించేసారు. సుకుమార్ శిష్యుడితో ఆశిష్‌రెండో సినిమా ప్ర‌క‌టించారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios