Asianet News TeluguAsianet News Telugu

లిప్ కిస్సులు, బోల్డ్ రొమాన్స్ పై దీపికా పదుకొనె కామెంట్స్.. గెహ్రైయాన్ ట్రైలర్ వైరల్

దీపికా పదుకొనె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గెహ్రైయాన్'. ఫిబ్రవరి 11న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలయింది. 

Deepika Padukone interesting comments on Gehraiyaan
Author
Hyderabad, First Published Jan 20, 2022, 8:12 PM IST

దీపికా పదుకొనె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గెహ్రైయాన్'. ఫిబ్రవరి 11న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలయింది. ఈ చిత్రంలో దీపికా పదుకొనె పాత్ర ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీపికా పదుకొనె, అనన్య పాండే ఈ చిత్రంలో కజిన్స్ గా నటిస్తున్నారు. 

అనన్య పాండే ఫియాన్స్ పాత్రలో సిద్దాంత్ చతుర్వేది నటిస్తున్నాడు. తన కజిన్ ఫియన్స్ అయిన సిద్ధాంత్ తో దీపికా ఎఫైర్ పెట్టుకుంటుంది. ఈ క్లిష్టమైన బోల్డ్ గా సాగే ప్రేమ కథ శకున్ బాత్రా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ట్రైలర్ లో దీపికా రోల్ బోల్డ్ గా ఎమోషనల్ గా సాగుతున్నట్లు చూపించారు. కరణ్ జోహార్ ఈ చిత్రానికి నిర్మాత.

ట్రైలర్ మొత్తం లిప్ కిస్సులు, ఇంటిమేట్ సన్నివేశాలతో నిండిపోయి ఉంది. దీపికా సిద్ధాంత్ మధ్య కెమిస్ట్రీ బోల్డ్ గా సాగుతూ.. దీపికా ఫ్యాన్స్ కి కనుల విందుగా ఉంది. దీపికా ఎక్కువగా గ్లామర్ ఒలకబోసే పొట్టిబట్టల్లోనే కనిపిస్తోంది. ఇటీవల చిత్రయూనిట్ ముంబైలో మీడియా సమావేశంలో పాల్గొంది. 

దర్శకుడు శకున్ మాట్లాడుతూ.. దీపికా లండన్ లో 83 షూటింగ్ లో ఉండగా ఈ కథ వినిపించా. కొన్ని రోజుల వరకు దీపికా నుంచి రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత ఆమెని మరోసారి నిర్మాతలు అప్రోచ్ కాగా కథ విని తాను చాలా ఎగ్జైట్ అయినట్లు, ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు దీపికా దీపికా తెలిపింది. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది అని శకున్ అన్నారు. 

దీపికా మాట్లాడుతూ.. నాలుగు నెలల పాటు ఈ చిత్రాన్ని గోవాలో లాక్ డౌన్ తర్వాత చిత్రీకరించాం. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంటూ దీపికా చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో పనిచేసిన వారంతా నా ఫ్రెండ్స్ గా మారిపోయారు అని పేర్కొంది. 

ఇక నా పాత్ర గురించి మాట్లాడుకుంటే.. బోల్డ్ గా ఉంటుంది, రియల్ గా అనిపించదు, ఎక్కువగా పొట్టి బట్టల్లో కనిపిస్తాను. అలాగే ఎమోషనల్ గా కూడా ఉంటుంది. ఇలాంటి పాత్రలో ఇంతకు ముందెప్పుడూ ఇండియన్ స్క్రీన్ పై రాలేదు అంటూ దీపికా చెప్పుకొచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios