Asianet News TeluguAsianet News Telugu

Doobey Video Song: మంటలు రేపుతున్న దీపికా.. బెడ్ సీన్స్ లో ఇలా రెచ్చిపోయిందేంటి

దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి. ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీపికా హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. 

Deepika Padukone Doobey Video Song goes viral
Author
Hyderabad, First Published Jan 25, 2022, 3:42 PM IST

దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి. ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీపికా హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే.  దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గెహ్రైయాన్'. ఫిబ్రవరి 11న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. 

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ గ్లామర్ తో కట్టి పడేసే దీపికా పదుకొనె ఈ చిత్రంలో ఇంటిమేట్ సన్నివేశాల్లో సైతం రెచ్చిపోయింది. తాజాగా ఈ చిత్రం నుంచి దూబెయ్ అనే వీడియో సాంగ్ విడుదలయింది. 

ఈ సాంగ్ లో దీపికా పదుకొనె సెగలు రేపే విధంగా సిద్ధాంత్ చతుర్వేదితో బెడ్ సీన్స్, లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. దీపికా పదుకొనె ఈ రేంజ్ లో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోవడం ఇదే తొలిసారి. దర్శకుడు ఈ సాంగ్ ని ఎక్కువ భాగం బీచ్ లలో, ప్రైవేట్ బోట్ లలో చిత్రీకరించారు. 

దీపికా ఈ రేంజ్ లో రొమాన్స్ లో రెచ్చిపోవడంపై ఆమె అభిమానులు కొందరు హార్ట్ అవుతున్నారు. పెళ్లి తర్వాత మరీ ఈ స్థాయిలో రొమాన్స్ చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొందరు అభిమానులు మాత్రం దీపికకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమె వృత్తి నటనలో భాగంగానే దీపికా ఈ చిత్రంలో నటించింది అని.. వేరే కోణంలో చూడొద్దని అంటున్నారు. 

ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రతి ఒక్కరూ దీపికా, సిద్దాంత్ మధ్య రొమాన్స్ గురించే చర్చించుకుంటున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios