Asianet News TeluguAsianet News Telugu

Dasari Narayana Rao Son: జైల్లో దాసరి నారాయణ రావు చిన్న కుమారుడు అరుణ్..

మూవీ లెజండ్.. దివంగత దాసరి నారాయణ రావు చిన్న కుమారుడు. ప్రముఖ టాలీవుడ్ నటుడు దాసరి అరుణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఈ తెల్లవారు జామున ఆయన్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Dasari Narayana Rao Son Tollywood Hero Arun Kumar Arrested
Author
Hyderabad, First Published Jan 20, 2022, 2:12 PM IST

మూవీ లెజండ్.. దివంగత దాసరి నారాయణ రావు చిన్న కుమారుడు. ప్రముఖ టాలీవుడ్ నటుడు దాసరి అరుణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఈ తెల్లవారు జామున ఆయన్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ యాక్టర్ దాసరి అరుణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ప్రముఖ దర్శకుడు, తెలుగు సినీ పరిశ్రమ లెజండ్.. దివంగత దాసరి నారాయణ రావు చిన్న కొడుకు దాసరి అరుణ్ కుమార్. ఆయన రాష్ డ్రైవింగ్ కేసులో అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ కేసులోనే ఆయన్ను అరెస్ట్ చేసిన బంజారా హిట్స్ పోలీస్టేషన్ కు తరలించినట్టు సమాచారం. ప్రస్తుతం దాసరి అరుణ్ పోలిస్టేషన్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది.

బంజారా హీల్స్ పోలీస్టేషన్ పరిదిలోని సయ్యద్ నగర్ లో .. తెల్లవారు జామున 4 గంటలకు దాసరి అరుణ్ కుమార్ కారును చాలా స్పీడ్ గా నడిపి.. రాష్ డ్రైవింగ్ ద్వారా రెండు బైక్ లను బలంగా ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. దాంతో ఆయన పై రాష్ డ్రైవింగ్ కేసును నమేదు చేసిన పోలీసులు.. అరుణ్ ను అరెస్ట్ చేసినట్టు సమాచారం.

అయితే  అరుణ్ కుమార్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన బంజారా హిల్స్ పోలీసులు… దాసరి అరుణ్ పై కేసు నమోదు చేశారు.  అయితే అరుణ్ కు బ్రీత్ అనలైస్ టెస్ట్ చేసిన తరువాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కన పిస్తుంది.. ఈ పరీక్షలలో డ్రింక్‌ చేసినట్లు తేలితే.. కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.

ఇక దాసరి అరుణ్ కుమార్ పై గతంలో చాలా కేసులు ఉన్నాయి. దాసరి నారాయణ రావు మరణించిన తరువాత అన్న దమ్ముల మధ్య ఆస్థివివాదాలు చెలరేగాయి. ఓ సారి అరుణ్ తమ ఇంట్లోకి గోడ దూకి అక్రమంగా ప్రవేశించాడని.. గోల చేశారంటూ దాసరి అరుణ్ కుమర్ అన్న ప్రభు కేసు కూడా పెట్టారు. ఇప్పటిక ఆ కుటుంబాల మధ్య ఆస్తి గొడవలు జరుగుతూనే ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు బయట కూడా అరుణ్ పలు పై కేసులు ఉన్నట్టు సమాచా

Follow Us:
Download App:
  • android
  • ios