దంగల్ గర్ల్ జైరా వాసింకు లైంగిక వేధింపులు.. వెక్కి వెక్కి ఏడ్చింది!!

దంగల్ గర్ల్ జైరా వాసింకు లైంగిక వేధింపులు.. వెక్కి వెక్కి ఏడ్చింది!!

మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ చిత్రంలో... మగ పిల్లలను సైతం ఒంటి చేత్తో మట్టి కరిపించిన సీన్స్ లో అద్బుతంగా నటించిన దంగల్ గర్ల్ జైరా వాసీంకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. అయితే అధి కాస్టింగ్ కౌచ్ కాదు. జైైరా ఓ ఉన్మాది తనతో అసభ్యంగా ప్రవర్తించాడని వెక్కి వెక్కి ఏడ్చి తన సోషల్ మీడియాలో ఘటనపై పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది తన విమాన ప్రయాణం సందర్భంగా కావడం నిజంగానే షాకింగ్ ఉదంతంగానే చెప్పుకోవాలి.

 

ఈ వేధింపులపై విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లేందుకు ఎయిర్ విస్తారా విమానం ఎక్కిన వాసీంపై ఓ వ్యక్తి చేతులు వేశాడట. వాసీం కూర్చున్న సీటుకు వెనుకే కూర్చున్న సదరు వ్యక్తి జైరా భుజం - మెడపై చేతులు వేశాడట. నడి వయసు కలిగిన ఆ వ్యక్తి అంతటితో ఆగకుండా... ఏకంగా సీటు కింద కాళ్లు పెట్టి ఆమెను మరింత అసభ్యకరంగా టచ్ చేశాడట. ఇదేదో రెప్పపాటుగానో - లేదంటే కొన్ని క్షణాల పాటో జరగలేదట.  ఏకంగా ఓ పది నిమిషాల పాటు జైరా వాసీంను అసభ్యకర రీతిలో తడుతూ రాక్షసానందం పొందిన ఆ వ్యక్తి... ఆ తర్వాత తనకేమీ తెలియనట్టే - తానేమీ చేయనట్టే వ్యవహరించాడట. నిద్ర మత్తులో ఉన్న జైరా... దీనిని గ్రహించేలోగానే అతడు తన కాలితో వాసీం మెడపై తడిమాడట.

దంగల్ సినిమాలో ధైర్యవంతురాలైన బాలికగా కనిపించిన జైరా... సదరు వ్యక్తి చేస్తున్న అసభ్య చేష్టలను కూడా కాస్తంత ధైర్యంగానే ప్రశ్నించిందట. అయితే తన దుశ్చేష్టలను కప్పిపుచ్చుకునే క్రమంలో ఆ వ్యక్తి... విమానం కుదుపుల కారణంగానే తాను అలా తాకానని - తన తప్పేమీ లేదనీ కవర్ చేసే ప్రయత్నం చేశాడట. అతడి ఉద్దేశ్యాన్ని పసిగట్టిన జైరా... మొత్తం విషయంపై విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసిందట. అయితే ఆమెను మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ... సిబ్బంది కూడా ఆమె వాదనను కనీసం చెవిన వేసుకున్న పాపాన కూడా పోలేదట. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన వాసీం అక్కడే వెక్కి వెక్కి ఏడ్చిందట.

 

ఈ మొత్తం ఎపిసోడ్ ను వివరిస్తూ ఓ వీడియోలో రికార్డు చేసిన తన వేదనను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. అసలు ఈ దేశంలో మృగాళ్ల నుంచి మహిళలను రక్షించేవారే లేరా అని ప్రశ్నిస్తూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు నిజంగానే వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న మహిళా కమిషన్ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... సదరు ప్రయాణికుడికి సంబందించిన వివరాలు అందజేయాల్సిందేనని విస్తారా ఎయిర్ లైన్స్ ను ఆదేశించింది. ఎన్ని శిక్షలు పడుతున్నా కీచకులు మాత్రం ఆగట్లేదు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page