Asianet News TeluguAsianet News Telugu

స్టార్ హీరోలని తలదన్నేలా లగ్జరీ కారవ్యాన్.. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో నరేష్ రేంజ్ వేరబ్బా

సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ టాలీవుడ్ లో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. మా ఎన్నికలు వచ్చాయంటే నరేష్ హంగామా మామూలుగా ఉండదు. ప్రస్తుతం విష్ణుకి ముందు మా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించింది నరేషే. 

character artist naresh luxury caravan
Author
Hyderabad, First Published Jan 25, 2022, 1:53 PM IST

సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ టాలీవుడ్ లో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. మా ఎన్నికలు వచ్చాయంటే నరేష్ హంగామా మామూలుగా ఉండదు. ప్రస్తుతం విష్ణుకి ముందు మా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించింది నరేషే. టాలీవుడ్ ప్రతి కార్యక్రమంలో నరేష్ చురుగ్గా పాల్గొంటుంటారు. మా అధ్యక్షుడిగా విష్ణు విజయంలో నరేష్ కీలక పాత్ర పోషించారు. 

ఇక నరేష్ నటుడిగా టాలీవుడ్ లో బిజీగా ఉండే క్యారెక్టర్ ఆర్టిస్ట్. నరేష్ ఎప్పుడూ ఫుల్ బిజీగా షూటింగ్స్ లో పాల్గొంటుంటాడు. నరేష్ కోసం దర్శకులు బలమైన పాత్రలు రచిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో నరేష్ ప్రతి చిత్రంలో ఎక్కువ సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుంది. టాలీవుడ్ లో నరేష్ అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరు. 

ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో నిర్మాతలు అరేంజ్ చేసే కారవ్యాన్ లు ఉపయోగించడం మంచిది కాదని నరేష్ భావించారు. అందుకే సొంతంగా ఓ లగ్జరీ కారవ్యాన్ ని నరేష్ కొనుగోలు చేశారు. తాను కోరుకున్న విధంగా ప్రత్యేకమైన కారవ్యాన్ ని నరేష్ ముంబై నుంచి కొనుగోలు చేశారట. 

character artist naresh luxury caravan

నరేష్ కారవ్యాన్ లో ఏసీ బెడ్ రూమ్, ప్రత్యేకమైన జిమ్ ప్లేస్, వాష్ రూమ్, మేకప్ రూమ్ ఉన్నాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు, హీరోయిన్లకు మాత్రమే లగ్జరీ కారవ్యాన్ లు ఉంటాయి. అలాంటిది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న నరేష్ కారవ్యాన్ కొనుగోలు చేశాడంటే అతడి రేంజ్ అర్థం చేసుకోవచ్చు. 

character artist naresh luxury caravan

ప్రస్తుతం నరేష్ కారవ్యాన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 90వ దశకంలో నరేష్ ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోగా నటించారు. జంబలకడి పంబ, ఆమె లాంటి మెమొరబుల్ హిట్స్ నరేష్ ఖాతాలో ఉన్నాయి. నరేష్ చివరగా హీరో, మ్యాస్ట్రో, టాక్ జగదీష్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. 

character artist naresh luxury caravan

Follow Us:
Download App:
  • android
  • ios