సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అభిమానులు చేసే హంగామా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు.  ముఖ్యంగా స్టార్ హీరోల అభిమానులు ఉత్సాహంగా ప్లెక్సీలు పెట్టడమే కాదు..దాన్ని క్రింద పడకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పుడు విజయ్ ఫ్లెక్సి క్రింద పడిన ఉదంతం తెలియచేస్తోంది. 

వివరాల్లోకి వెళితే... రీసెంట్ గా విజయ్ నటించిన సర్కార్ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ సందర్బంగా అభిమానులు చాలా ఉత్సాహంగా ప్రమోషన్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సారి కేరళలోని ఫ్యాన్స్ పెట్టిన కటౌట్స్ వార్తల్లో నిలిచాయి.  అయితే ఓ కటౌట్ కుప్ప కూలి ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

కేరళలలోని  ఓ థియేటర్‌లో   విజయ్ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కటౌట్ కూలిన ఘటనలో నాలుగు టూవీలర్ బైక్ లు , థియేటర్ అద్దాలు ధ్వంసమయ్యాయి. అత్తింగళ్‌లోని గంగ థియేటర్‌‌లో ఈ ప్రమాదం జరిగింది.

విజయ్ సర్కార్ సినిమా సందర్భంగా అభిమానులు 50 అడుగుల ఎత్తున్న భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దీనికి పాలాభిషేకం చేశారు.  అయితే, ఆ తర్వాత కాసేపటికే కటౌట్ పెద్ద శబ్దం చేస్తూ కూలిపోయింది. థియేటర్ లోపల ఇది పడడంతో హాల్ అద్దాలు బద్దలవడంతోపాటు నాలుగు టూ వీలర్ వెహికల్స్ ధ్వంసమయ్యాయి. 

ఈ సంఘటనపై థియేటర్ యాజమాన్యం మండిపడింది.  అభిమాన సంఘంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, సమస్యను కోర్టు బయట పరిష్కరించుకునేందుకు ఇరు వర్గాలు అంగీకారానికి రావడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఫ్యాన్స్ ఇప్పుడు ఆ నష్టాన్ని భరించటానికి సిద్దపడ్డారని తెలుస్తోంది. ఎవరి ప్రాణాలకైనా ముప్పు కలిగితే అప్పుడు పరిస్దితి ఏమయ్యేదని థియోటర్ యాజమాన్యం అంటోంది.

ఇవి కూడా చదవండి..

జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!