ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్‌ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్ చేసిన అభిషేక్‌ `అమ్మ వదిలిపెట్టదు సియా నిన్ను ఎలాగైనా కనిపెడుతుంది` అంటూ కామెంట్ చేశాడు.

మాధవన్‌ లీడ్‌ రోల్‌ లో తెరకెక్కిన సూపర్‌ హిట్ వెబ్‌ సిరీస్‌ బ్రీత్. కొడుకు ప్రాణాలు కాపాడేందుకు హత్యలు చేసే తండ్రి పాత్రలో మాధవన్‌ అద్బుతంగా నటించాడు. తొలి సీజన్‌ సూపర్‌ హిట్ కావటంతో రెండో సీజన్‌ ను రూపొందించారు. సీజన్‌ 2 లీడ్‌ రోల్‌లో అభిషేక్‌ బచ్చన్‌ నటించాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో అభిషేక్ లుక్‌ను రివీల్‌ చేసిన మేకర్స్ తాజాగా మరో లీడ్‌ క్యారెక్టర్ నిత్యామీనన్‌ క్యారెక్టర్‌ను కూడా రివీల్ చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఓ చిన్నారితో సరదాగా ఆడుకుంటున్న నిత్యామీనన్‌ వీడియోతో పాటు బ్యాక్‌ గ్రౌండ్‌ లో `Sab kuch perfect tha. Phir ek din… sab badal gaya. Kya aap jaante hain hamari Siya kahan hai?` (అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఒక్క రోజులో అంతా మారిపోయింది మా సియా ఎక్కడ ఉందో మీకు తెలుసా ) అంటూ వాయిస్ వస్తుంది. ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్‌ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్ చేసిన అభిషేక్‌ `అమ్మ వదిలిపెట్టదు సియా నిన్ను ఎలాగైనా కనిపెడుతుంది` అంటూ కామెంట్ చేశాడు.

ఈ సిరీస్‌లో అభిషేక్.. అవినాష్‌ సబర్వాల్‌ పాత్రలో నటిస్తుండగా నిత్యా మీనన్ ఆయన భార్య అబాగా కనిపించనుంది. ఇప్పటికే రెండు టీజర్‌లు రిలీజ్ చేసిన మేకర్స్ జూలై 1న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అభిషేక్‌, నిత్యలు తొలిసారిగా ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తుండటంతో ఈ షోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బ్రీత్‌ ఇన్‌ టు ద షాడోస్‌ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ దాదాపు 200 దేశాల్లో ఒకేసారి అమెజాన్‌ ఒరిజినల్స్‌ ద్వారా విడుదల కానుంది. 

క్లైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ షో జూలై 10న విడుదల కానుంది. సయామీ ఖేర్‌, అమిత్‌ సాద్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భవానీ ఐయ్యర్‌, విక్రమ్ తులి, అర్షద్‌ సయ్యద్‌ మయాంక్‌ శర్మలు అందించిన కథను మయాంక్‌ శర్మ దర్శకత్వంలో రూపొందించారు. అబుడాంటియా ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్న ఈ షోతో అభిషేక్‌ బచ్చన్‌ డిజిటల్‌ఎంట్రీ ఇస్తున్నాడు.

Scroll to load tweet…