Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 6: కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆడుకొని ఏడిపించేసిన బిగ్ బాస్..!

హౌస్లో ఎమోషనల్ ఎపిసోడ్ చోటు చేసుకుంది. బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ ఏడిపించేశాడు. కుటుంబ సభ్యులతో లింకు పెట్టి ఎమోషన్స్ తో ఆదుకున్నాడు. 
 

bigg boss telugu 6 bigg boss playing with contestants emotions
Author
First Published Oct 11, 2022, 3:27 PM IST


బిగ్ బాస్ సీజన్ 6 సక్సెస్ ఫుల్ గా ఆరవ వారంలో మొదలుపెట్టింది. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాగా మంగళవారం కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. దీని కోసం 'బ్యాటరీ రీఛార్జ్' అనే టాస్క్ ఇవ్వడం జరిగింది. గార్డెన్ ఏరియాలో ఇంటి సభ్యుల పెర్ఫార్మన్స్ ఆధారంగా ఛార్జ్ అవుతూ తగ్గుతూ ఉండే బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఇంటి సభ్యుల ఎమోషన్స్ కి పరీక్షలా ఉంది. 

బిగ్ బాస్ మూడు ఆప్షన్స్ ఇస్తారు. ప్రతి ఆప్షన్ కి భిన్నమైన బ్యాటరీ రీఛార్జ్ పర్సెంటేజ్ ఉంటుంది. వారు ఎంచుకున్న ఆప్షన్ క్రింద ఎంత పర్సంటేజ్ బ్యాటరీ ఉంటుందో అంత పెర్సెంటేజ్ బ్యాటరీ కోల్పోవాల్సి ఉంటుంది. కంటెస్టెంట్ శ్రీహాన్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్ వీడియో కాల్, ఫుడ్, ఆడియో మెసేజ్ అనే  ఆప్షన్స్ ఇచ్చారు. శ్రీహాన్ ఫుడ్ కావాలని ఆప్షన్ ఎంచుకుంటే 15% బ్యాటరీ కొల్పాతాడు. కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడాలనుకుంటే 35%, ఆడియో మెసేజ్ ఆప్షన్ ఎంచుకుంటే 30% రీఛార్జ్ కోల్పోతాడు. 

కుటుంబ సభ్యులతో మాట్లాడాలని ఉన్నా వీడియో కాల్, ఆడియో మెసేజ్ ఆప్షన్స్ ఎంచుకుంటే అధిక మొత్తంలో బ్యాటరీ ఛార్జ్ కోల్పోతాడు. దీంతో శ్రీహాన్ కన్నీరు పెట్టుకున్నారు. అతడు మూడు ఆప్షన్స్ లో ఏదీ వద్దని బిగ్ బాస్ తో చెప్పాడు. ఏదీ ఎంచుకోకపోతే ఇంటి సభ్యులు మొత్తం పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుందని బిగ్ బాస్ హెచ్చరించారు. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ దాదాపు ఇలాంటి ఆప్షన్సే ఉంటాయి. 

ఇంటి సభ్యులు ఎమోషనలై కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడితే అధిక మొత్తంలో ఛార్జ్ కోల్పోతారు. దాంతో కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోతారు. ఎమోషనల్ టాస్క్ కావడంతో ఇంటి సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. సత్యశ్రీ, శ్రీహాన్ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ వారం ఆదిరెడ్డి, గీతూ, బాల ఆదిత్య, రాజశేఖర్, సుదీప, కీర్తి, శ్రీహాన్, మెరీనా,శ్రీసత్య నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios