Asianet News TeluguAsianet News Telugu

ఖరీదైన బీఎండబ్ల్యూ  కారు కొన్న బిగ్ బాస్ షణ్ముఖ్.. దాని ధర ఎంతో తెలుసా!


షణ్ముఖ్ జస్వంత్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కొన్నారు. ఈ సంతోషకర విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. కొత్త కారుపై కూర్చొని ఫోటో దిగి ఫ్యాన్స్ కోసం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. 
 

bigg boss fame shanmukh buys a new car on dusshra 2022 day
Author
First Published Oct 5, 2022, 9:22 PM IST

బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ దసరా పండగ వేళ ఖరీదైన కారు సొంతం చేసుకున్నారు. లగ్జరీ బ్రాండ్ బీఎండబ్ల్యూ కారు దక్కించుకున్నారు. పేరెంట్స్ తో పాటు హైదరాబాద్ షో రూమ్ కి వెళ్లిన షణ్ముఖ్ తన కల సాకారం చేసుకున్నాడు. ఇక కొత్తకారు పక్కనే ఫోజులిస్తూ ఫోటోలు దిగాడు. ఈ సంతోషక విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. నన్ను ఈ స్థాయిలో చూడాలనుకున్నవారు పేరెంట్స్, మీరు(ఫ్యాన్స్) మాత్రమే, ఇంకెవరూ కాదని కామెంట్ పోస్ట్ చేశాడు. ఈ కారు కొనడం కలలా ఉంది. ఎప్పుడైనా కనిపిస్తే లిఫ్ట్ అడగండి తప్పక ఇస్తానని ప్రామిస్ చేశాడు. 

ఇక షణ్ముఖ్ కొన్న కొత్త కారు ఖరీదు చుక్కల్లో ఉంది.  బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాండ్ కోప్ మోడల్ కి చెందిన ఆ కారు ధర రూ. 51 లక్షల వరకూ ఉంది. ఎప్పటి నుండో లగ్జరీ కారు కొనాలనుకుంటున్న షణ్ముఖ్ ఎట్టకేలకు బీఎండబ్ల్యూ సొంతం చేసుకున్నారు. ఇక యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన షణ్ముఖ్ సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యాడు. ఆ పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకున్నాడు. 

బిగ్ బాస్ తెలుగు 5 రన్నర్ గా షణ్ముఖ్ నిలిచాడు. ఫైనల్లో అతడు సన్నీతో పోటీపడ్డారు. ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలతో పాటు సిరీస్లలో నటిస్తున్నాడు. కాగా షణ్ముఖ్ తన చిరకాల ప్రేయసి దీప్తి సునయనతో విడిపోయాడు. చాలా కాలం ప్రేమించుకున్న ఈ జంట గత ఏడాది బ్రేకప్ చెప్పుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ సిరితో షణ్ముఖ్ సన్నిహితంగా మెలిగారు. ఈ కారణంగానే దీప్తి షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios