Asianet News TeluguAsianet News Telugu

త్రివిక్రమ్ - త్రినాథ రావ్.. నెక్స్ట్ ఎవరితో వెంకీ?

F2 సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్ సక్సెస్ మూడ్ లో గ్యాప్ లేకుండా కథలు వినేస్తున్నాడు. ప్రస్తుతం మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ మామ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న   ఆ సినిమాను డి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. 

big suspense on venky next director
Author
Hyderabad, First Published May 10, 2019, 9:55 AM IST

F2 సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్ సక్సెస్ మూడ్ లో గ్యాప్ లేకుండా కథలు వినేస్తున్నాడు. ప్రస్తుతం మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ మామ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న   ఆ సినిమాను డి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. 

ఇక వెంకీ మామ అనంతరం దగ్గుబాటి హీరో ఎవరితో వర్క్ చేస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇటీవల విక్రమ్ వేధా రీమేక్ చేయబోతున్నట్లు టాక్ వచ్చినప్పటికీ అందులో నిజం లేదని సురేష్ ప్రొడక్షన్స్ నుంచి క్లారిటీ వచ్చింది. వెంకీ నెక్స్ట్ సినిమాపై  త్వరలోనే వివరణ ఇస్తామని కూడా చెప్పారు. 

అయితే నెక్స్ట్ వెంకీతో వర్క్ చేయబోయే లిస్ట్ కాస్త పెద్దగానే ఉంది. పుట్టినరోజు సందర్భంగా గతంలోత్రివిక్రమ్ తో ఒక సినిమా ఉంటుందని స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేశారు. ఇక నేను లోకల్ దర్శకుడు త్రివిక్రమ రావ్ నక్కినతో కూడా వెంకీ కథా చర్చలు జరిపారు. స్క్రిప్ట్ దాదాపు ఫైనల్ అయినట్లు టాక్. 

అయితే ఇద్దరిలో ఫస్ట్ ఎవరి సినిమా పట్టాలెక్కనుందనే విషయం త్వరలో తెలియనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ అయితే బన్నీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది కానీ పూర్తికాదు. ఇక త్రినాథ రావ్ 'హలో గురు ప్రేమ కోసమే' సినిమా అనంతరం ఎలాంటి ప్రాజెక్ట్ ని సెట్ చేసుకోలేదు. అతను వెంకీతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నాడు. 

ఆ మధ్య మరో హీరోతో కూడా సిట్టింగ్ వేసినట్లు టాక్ వచ్చినప్పటికీ అందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు. అయితే  వెంకీ మామ షూటింగ్ ఫినిష్ అయ్యే లోపు ఎవరు అందుబాటులో ఉంటే వారితోనే వెంకీ సినిమా చేస్తాడా? లేక మరో దర్శకుడిని సెలెక్ట్ చేసుకుంటాడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.     

Follow Us:
Download App:
  • android
  • ios