ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను 'ఫిదా' చేసిన మలయాళి భామ సాయి పల్లవి . దీంతో ఆమె వరుస ఆఫర్లు క్కూ కట్టాయి. మరో వైపు సాయి పల్లవి చుట్టూ పలు వివాదాలు సైతం ముసురుకుంటున్నాయి. తాజాగా ఆమె గురించి ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది.సాయి పల్లవి మీద ఏపీకి చెందిన మినిస్టర్ కొడుకు మనసు పారేసుకున్నాడని తాజాగా ఫిల్మ్ నగర్లో ఓ ప్రచారం మొదలైంది. ఆమె అందాన్ని చూసి అతడు ఫిదా అయ్యాడని.... ఆమె లేకుంటే జీవితం లేదు అనే విధంగా తయారయ్యాడంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.


ఇటీవల సాయి పల్లవిని కలిసిన సదరు మినిస్టర్ కుమారుడు.... ఆమెకు ప్రపోజ్ కూడా చేశాడని, పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధమని ఆమెకు వెల్లడించినట్లు సమాచారం.అతడి ప్రపోజల్ మీద సాయి పల్లవి స్పందిస్తూ..... తన పెళ్లి విషయాలు తల్లిదండ్రులు చూసుకుంటారని, ఎప్పుడు జరుగాలనేది కూడా వారే నిర్ణయిస్తారని, వారు చెప్పిన వ్యక్తినే తాను పెళ్లి చేసుకంటానని అతడికి చెప్పినట్లు సమాచారం.సాయి పల్లవి సమాధానంతో...మినిస్టర్ కొడుకు ఆమె తల్లిదండ్రులను సంప్రదించాడని, అయితే వారు తమ కూతురుకు ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశ్యం లేదని చెప్పి పంపినట్లు సమాచారం. అయితే సాయి పల్లవిపై మనసు పారేసుకున్న ఆ మినిస్టర్ కొడుకు ఎవరు? అనేది ఇంకా బయటకు రాలేదు. ఏది ఏమైనా టాలీవుడ్లో పాపులర్ అయిన సాయి పల్లవి చుట్టూ ఇలాంటి వివాదాస్పదాలు ముసుకుకోవడం చర్చనీయాంశం అయింది.