Asianet News TeluguAsianet News Telugu

తెలుగు సినిమా కోసం మరోసారి గొంతు విప్పిన తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. పటాసు పిల్లా అంటూ..

డిజె టిల్లు  సినిమానుంచి మరో అద్భుతమైన సాంగ్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. నేహాశెట్టి తో పటాస్ పిల్ల పటాస్ పిల్ల అంటూ సందడిచేశాడు హీరో  సిద్దు జొన్నలగడ్డ.  

Anirudh Ravichandran, Siddu Jonnala Gadda, Dj Tillu
Author
Hyderabad, First Published Jan 24, 2022, 2:29 PM IST

డిజె టిల్లు  సినిమానుంచి మరో అద్భుతమైన సాంగ్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. నేహాశెట్టి తో పటాస్ పిల్ల పటాస్ పిల్ల అంటూ సందడిచేశాడు హీరో  సిద్దు జొన్నలగడ్డ.  

 సిద్ధు జొన్నలగడ్డ .. నేహాశెట్టి జంటగా నటించిన సినిమా డీజే టిల్లు.సితార - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేవారు. రొమాంటిక్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈమూవీ కరోనా కారణంగా లేట్ అయ్యింది. కాని అప్పుడప్పుడు ఈ మూవీ టీమ్ వదిలే అప్ డేట్స్ వల్ల సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి పట్టాసు పిల్లా .. పట్టాసు పిల్లా అనే సాంగ్ ను రిలీజ్ చేశారు.


లవ్ .. రొమాన్స్ ను బేస్ చేసుకుని సాగే ఈ పాటను కోలివ్  ప్రధానంగా చేసుకుని సాగే ఈ పాటను తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ పాడారు.  శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ పాటకి కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించారు. అనిరుధ్ తెలుగు లో చాలా సి నిమాలకు సంగీతం అందించారు. చాలా పాటలను ఆయన స్వయంగా పాడారు. కాని కొంత కాలంగా ఆయనకు తెలుగు సినిమాకు కొంత గ్యాప్ వచ్చింది. ఇఫ్పుడు ఈ పాటతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు అనిరుధ్.


ఆరెంజ్ .. గుంటూరు  టాకీస్ ..కల్కి లాటి  సినిమాల్లో లీడ్ రోల్ చేసిన యంగ్ హీరో  సిద్ధు.. ఈ సినిమాలో రొమాంటిక్ హీరోగానే నటించినట్టు తెలుస్తోంది. ఈసారి ఈ సినిమాతో రొమాంన్స్ డోస్ ఇంకా పెంచినట్టు సమాచారంమరి ఈ సినిమా ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. బ్రహ్మాజీ .. ప్రగతి లాంటి టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నారు

ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పటాసు పిల్ల సాటకు మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. ఈ పాట  సంగీతాభిమానులకు ఎంతగానో చేరువ అయింది. ఎంటర్టైన్మెంట్ మెయిన్ లీడ్ గా.. త్వరలో రిలీజ్ కు ముస్తాబు అవుతున్న డిజే టిల్లు మూవీ అప్పుడే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసేశారు. టీవీ ప్రోగ్రామ్స్ లో మెరుస్తూ.. తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios