Asianet News TeluguAsianet News Telugu

బ్రీత్‌ 2 ఫస్ట్‌ లుక్‌.. మాధవన్‌ పాత్రలో అభిషేక్‌

 `బీత్ర్‌; ఇన్‌ టు ద షాడోస్‌` ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. ఈ ఫస్ట్‌ లుక్‌లో సీరియస్‌ లుక్‌లో ఉన్న అభిషేక్‌ తప్పిపోయని బిడ్డ పోస్టర్‌ను పట్టుకొని కనిపిస్తున్నాడు. తాజాగా ఈ షోకు సంబంధించిన టీజర్‌ రిలీజ్ అయ్యింది. అభిషేక్‌ బచ్చన్‌ తన సోషల్ మీడియా పేజ్‌ ల ద్వారా ఈ టీజర్‌ను రిలీజ్ చేశాడు.

An intriguing logo reveal of Amazon Original Series Breathe: Into The Shadows
Author
Hyderabad, First Published Jun 21, 2020, 3:33 PM IST

మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్‌ హిట్ వెబ్‌ సిరీస్‌ బ్రీత్‌. తన కొడుకు కోసం హత్యలు చేసే తండ్రి పాత్రలో మాధవన్‌ అద్బుతంగా నటించి మెప్పించాడు. అమెజాన్‌ ఒరిజినల్స్‌లో రిలీజ్ అయిన ఈ సిరీస్‌ సెకండ్ సీజన్‌లో లీడ్‌ లో రోల్‌ లో అభిషేక్‌ బచ్చన్‌ నటించాడు. తాజాగా `బీత్ర్‌; ఇన్‌ టు ద షాడోస్‌` ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. ఈ ఫస్ట్‌ లుక్‌లో సీరియస్‌ లుక్‌లో ఉన్న అభిషేక్‌ తప్పిపోయని బిడ్డ పోస్టర్‌ను పట్టుకొని కనిపిస్తున్నాడు.

తాజాగా ఈ షోకు సంబంధించిన టీజర్‌ రిలీజ్ అయ్యింది. అభిషేక్‌ బచ్చన్‌ తన సోషల్ మీడియా పేజ్‌ ల ద్వారా ఈ టీజర్‌ను రిలీజ్ చేశాడు. ఈ షో ద్వారా బాలీవుడ్ నిర్మాణ సంస్థ అబండాంటియ ఎంటర్‌టైన్మెంట్‌ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్‌కు కూడా ఇదే తొలి డిజిటల్‌ షో. జూలై 10న రిలీజ్‌ రిలీజ్ అవుతున్న ఈ షోలో నిత్యా మీనన్‌, సయామీ ఖేర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సీరిస్‌ దాదాపు 200 దేశాల్లో అందుబాటులోకి రానుంది. 

ఈ సిరీస్‌కు మయాంక్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. భవానీ ఐయ్యర్, విక్రమ్ తులి, అర్షద్ సయ్యద్‌ మయాంక్‌తో కలిసి కథ అందిచారు. భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా షో ట్రైలర్‌ను జూలై 1 న రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాతలు వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios