యంగ్ హీరో ఆకాష్ పూరీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు.
జార్జ్ రెడ్డి ఫేమ్ దర్శకుడు జీవన్ రెడ్డి డైరెక్షన్ లో యంగ్ అండ్ టాలెండెట్ హీరో ఆకాష్ పూరి (Akash Puri) నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘చోర్ బజార్’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నందమూరి బాలకృష్ణ విడుదల చేసిన ‘చోర్ బజార్’ ట్రైలర్‌కి విశేషమైన స్పందన లభించింది. అదేవిధంగా ప్రతిష్టాత్మక యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ చిత్ర చర్చనీయాంశంగా మారింది.
కాగా ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. సురేష్ బొబ్బిలి అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా ట్రెండ్ అవుతున్నాయి. ట్రైలర్ కు మంచి టాక్ వచ్చింది. ఇవన్నీ సినిమా మీద పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. బిజినెస్ సర్కిల్స్ లో క్రేజ్ ఏర్పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుండటం మూవీ స్థాయిని మరింతగా పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం ప్రేమ, యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ గా ప్రేక్షకులను అలరించనుంది.
