Asianet News TeluguAsianet News Telugu

Srikanth: తిరుమల శ్రీవారి సేవలో శ్రీకాంత్ కుటుంబం!

గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో  శ్రీకాంత్,కొడుకు, భార్య ఊహ లతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.  

actor srikanth visits tirumala along with family
Author
Hyderabad, First Published Jan 20, 2022, 1:31 PM IST


నటుడు శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో పాటు తిరుమలలో సందడి చేశారు.గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో  శ్రీకాంత్,కొడుకు, భార్య ఊహ లతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.  ఇక శ్రీకాంత్ విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించిన శ్రీకాంత్ (Srikanth)... తర్వాత హీరోగా ఎదిగారు. లవ్, ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ తో ఓ స్థాయి హీరోగా ఎదిగారు. దాదాపు రెండు దశాబ్దాలు శ్రీకాంత్ హీరోగా కొనసాగారు. హీరోగా ఆయన ఫేడ్ అవుట్ దశకు చేరుకోగా విలన్ గా సక్సెస్ కావాలనుకుంటున్నాడు. 

యుద్ధం శరణం మూవీతో విలన్ గా మారిన శ్రీకాంత్ ఇటీవల విడుదలైన అఖండ (Akhanda) చిత్రంలో విలన్ రోల్ చేశాడు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది. అఖండ విలన్ గా శ్రీకాంత్ కి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు. 

మరోవైపు కొడుకు రోషన్ ని హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో శ్రీకాంత్ ఉన్నారు. రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందD ఇటీవల విడుదలైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పెళ్లి సందD మూవీలో నటించడం విశేషం. 

అలాగే రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్, పుట్టపర్తి సత్యసాయి బాబా ట్రస్టుకు చెందిన మధుసుదన్ తిరుమలేశుని ఆశీస్సులు పొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 50వేల మంది పిల్లలకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని మెదలు పెడుతున్నట్లు మధుసుదన్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios