మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ `ఆచార్య`. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం థియేటర్లో సందడి చేస్తుంది. అయితే ఓటీటీలో రిలీజ్‌కి సంబంధించిన అప్‌డేట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నుంచి మూడేళ్ల తర్వాత వచ్చిన సినిమా `ఆచార్య`(Acharya). `ఖైదీ నెం.150` తర్వాత చిరంజీవి నుంచి కమర్షియల్ సినిమా లేదు. `సైరా` హిస్టారికల్ మూవీగా నిలిచింది. క్రిటిక్స్ ని నుంచి ప్రశంసలందుకుంది కానీ, కమర్షియల్‌గా యావరేజ్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన `ఆచార్య` చిత్రంపై మెగా ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్` తర్వాత రామ్‌చరణ్(Ram Charan) నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు మరింతగా పెరిగాయి. పూజా హెగ్డే గ్లామర్ తోడు కాబోతుంది.
ఈ నేపథ్యంలో `ఆచార్య` ఎట్టకేలకు నేడు(ఏప్రిల్ 29)న శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా థియేటర్లో రన్ అవుతుంది. సినిమాకి కాస్త మిక్స్ డ్ టాక్ వస్తుంది. చిరంజీవి రేంజ్‌లో సినిమా లేదనే టాక్ ప్రధానంగా వినిపిస్తుంది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా `ఆచార్య` ఫలితం ఇప్పుడు బెడిసికొట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓటీటీ రాబోయే డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. ఆచార్య `అమెజాన్ ప్రైమ్`లో స్ట్రీమింగ్ కాబోతుంది. సినిమాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఓటీటీ డిజిటల్ పార్టనర్‌గా అమెజాన్ ప్రైమ్‌గా చూపించారు.
ఇదిలా `ఆచార్య` ఓటీటీ రిలీజ్ డేట్(Acharya OTT Release Date) కూడా కన్ఫమ్ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాని మే ఎండింగ్‌లోగానీ, జూన్ మొదటి వారంలోగానీ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకు ఓటీటీలో రావడానికి దాదాపు రెండు నెలలు పడుతుంది. అదే పరాజయం చెందిన చిత్రాలను నెలలోపే స్ట్రీమింగ్ చేస్తున్నారు. `రాధేశ్యామ్` నెల రోజుల లోపే ఓటీటీలో విడుదలైంది. `గని` కూడా అంతే. అలాగే `బీస్ట్` కూడా వెంటనే ఓటీటీలో రాబోతుంది.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ `ఆచార్య` చిత్రాన్ని కూడా నెల రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంగా అనేది తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన తొలి చిత్రం `ఆచార్య`. గతంలో పాటల్లో మెరిశారు, కానీ నటించింది లేదు. ఫస్ట్ టైమ్ `ఆచార్య`లో చూస్తుండటంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇద్దరిని కలిసి చూడాలనేది చరణ్ మమ్మి సురేఖ డ్రీమ్ కూడా. ఈ చిత్రంతో ఆమె కోరిక నెరవేరిందని చెప్పొచ్చు. అయితే సినిమా హిట్ అయితే ఆమె ఇంకా సంతోషించేది. మరి పూర్తి ఫలితం మరో వీకెండ్‌తో తేలబోతుంది.