కండల వీరుడు సల్మాన్ ఖాన్ విషయంలో పెళ్లి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సల్మాన్ మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా పెళ్లి ప్రస్తావనని మీడియా ప్రతినిధులు తీసుకువస్తారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం చాలా సింపుల్ గా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటాడు. 

ఒక సందర్భంలో లో అయితే ప్రపంచంలో రోజు రోజుకు పెళ్లి ఖర్చులు ఎక్కువైపోతున్నాయట. అందుకే నేను పెళ్లి చేసుకోలేదు అని కొంటెగా సమధానం ఇచ్చాడు. ఇక ఈ కండల వీరుడి జీవితంలో ప్రేమ వ్యవహారాలకు మాత్రం కొదవ లేదు. 

ప్రియమణి సెక్సీ ఫోజులు.. మీరెప్పుడూ చూడని హాట్ ఫోటోస్

ప్రస్తుతం సల్మాన్ ఖాన్, రొమేనియన్ బ్యూటీ ఇలియా వంటూర్ ఫామ్ హౌస్ లో సహజీవనం చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇలియాకి సల్మాన్ ఖాన్ తో ఎఫైర్ కి సంబందించిన ప్రశ్న ఎదురైంది. మీరు సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోబోతున్నారా అని ప్రశ్నించగా వెంటనే నవ్వేసి ఆ విషయాన్నీ దాటవేసింది. 

తన జీవితంలో పెళ్లి అంత ముఖ్యమైనది కాదని ఇలియా తెలిపింది. పెళ్లి కంటే భావాలు, బంధాలు ముఖ్యమని.. అవి ఎంతకాలం బలంగా ఉంటాయనేది కీలకం అని వేదాంతం చెబుతోంది. నా కుటుంబ సభ్యులు రోజు పెళ్లి ప్రస్తావన తీసుకువస్తున్నారు. కానీ పెళ్లి తనకు సంతోషాన్ని ఇవ్వదు అని ఇలియా చెప్పుకొచ్చింది.