టీడీపీకి మరో ఎదురుదెబ్బ: వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు...?
తోట త్రిమూర్తులు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతుందని తెలియడంతో చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. బుజ్జగింపు చర్యలకు శ్రీకారం చుట్టారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను తోట త్రిమూర్తులు ఇంటికి పంపించారు.

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కీలక నేతల రాజీనామాతో ఇబ్బందిపడుతున్న తెలుగుదేశం పార్టీకి మరో కీలక నేత షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. జిల్లా తెలుగుదేశం పార్టీలో నెలకొన్న ఆధిపత్యపోరు తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ మారతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తోట త్రిమూర్తులు రంగం సిద్ధం చేసుకుంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గత కొంతకాలంగా టీడీపీపై అలకబూనిన తోట త్రిమూర్తులు ఇక తెలుగుదేశం పార్టీ ఇమడలేక బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వైసీపీ కీలక నేతలతో తోట త్రిమూర్తులు సంప్రదింపులు జరిపారని సమాచారం. అంతేకాదు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న సమీక్ష సమావేశానికి సైతం తోట త్రిమూర్తులు గైర్హాజరయ్యారు. నియోజకవర్గంలోనే ఉండి సమావేశానికి హాజరుకాకపోవడంపై చంద్రబాబు ఆరా తీశారు.
తోట త్రిమూర్తులు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతుందని తెలియడంతో చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. బుజ్జగింపు చర్యలకు శ్రీకారం చుట్టారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను తోట త్రిమూర్తులు ఇంటికి పంపించారు.
తోట త్రిమూర్తులతో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం భేటీ అయ్యారు. పార్టీ వీడుతున్నారంటూ వస్తున్న ప్రచారంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో తనకు అవమానాలు ఎదురవుతున్నట్లు తోట త్రిమూర్తులు రెడ్డి సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం.
జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మాజీమంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడులు తనను అవమానిస్తున్నారంటూ రెడ్డి సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకువెళ్లారు. తనను పట్టించుకోకపోవడమే కాకుండా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయాన్ని సుబ్రహ్మణ్యానికి స్పష్టం చేయలేదు తోట త్రిమూర్తులు.
ఇకపోతే తోట త్రిమూర్తులు ఎన్నికల ప్రచారానికి ముందే తెలుగుదేశం పార్టీ వీడతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆనాడు వైసీపీ కీలకనేత, ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సైతం కలిశారు. టికెట్ల సర్ధుబాటు నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చిందని ప్రచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలైన తర్వాత తోట త్రిమూర్తులు పార్టీ తీరుపై తీవ్ర గుర్రుగా ఉన్నారు. పార్టీలోని కొందరు నేతల వల్లే తాము ఓటమి పాలయ్యామంటూ బహిరంగంగానే విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉండగా తోట త్రిమూర్తులు ఓటమిపాలైన కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించారు.
ఈ భేటీలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు పార్టీ నాయకత్వంపై కూడా ఆయన మండిపడ్డారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ఉన్నచోట తెలుగుదేశం పార్టీ సహకరించలేదంటూ తోట త్రిమూర్తులు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఇంతకీ తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీని వీడతారా...? వైసీపీలో చేరతారా...? లేక బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా అనేది తెలియాలి అంతే తోట త్రిమూర్తులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
బీజేపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి: తేల్చేసిన తోట త్రిమూర్తులు
చంద్రబాబుకు తలనొప్పి: టీడీపీలో ప్రజావేదిక చిచ్చు
మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు
బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు
టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్
మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ
టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్
ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్
టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి
సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్
స్పీకర్‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?
మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు
టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?
టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్
చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?
చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్
తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?
చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి
రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....