అనంతపురం: సీనియర్ రాజకీయ వేత్త, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి. తన సోదరుడు జేసీ దివాకర్‌రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని స్పష్టం చేశారు. 

తన సోదరుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పినా తాను మాత్రం రాజకీయాల్లోనే కొనసాగుతానని తెలిపారు. ఇన్నాళ్లు తన వెంట నిలిచిన కార్యకర్తలు, తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

తన నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఏ స మస్య వచ్చినా ముందుండి పోరాడతానని తెలిపారు. తాము పార్టీ మారతామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. డ బ్బు కావాల్సిన వారే పార్టీలు మారుతారని జేసీ ప్రభాకర్ రెడ్డి జోస్యం చెప్పారు.