న్యూఢిల్లీ: రాజ్యసభలో తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరుతూ రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడుకు నలుగురు టీడీపీ ఎంపీలు లేఖ ఇచ్చారు.

గురువారం సాయంత్రం టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి,  సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు  రాజ్యసభ ఛైర్మెన్ కు లేఖ రాశారు.

 ఈ లేఖను రాజ్యసభ ఛైర్మెన్‌ వెంకయ్యనాయుడుకు అందజేశారు.

రాజ్యసభలో ఆరుగురు టీడీపీ ఎంపీలు ఉన్నారు. నలుగురు ఎంపీలు తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని లేఖ రాశారు. మిగిలిన వారిలో తోట సీతా రామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్ మాత్రం టీడీపీ వైపు ఉన్నారు.

ఏపీలో టీడీపీ ఘోరంగా  పరాజయం పాలైంది.  వైసీపీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో మరోసారి రెండోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో తమకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేసింది.

రాజ్యసభలో బీజేపీ బలాన్ని పెంచుకొనే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరుతూ  రాజ్యసభ చైర్మెన్‌కు లేఖ రాశారు. దీని వల్ల ఈ నలుగురు తమ రాజ్యసభ పదవులను కోల్పోయే అవకాశం ఉండదు. 

ఈ నలుగురు బీజేపీలో చేరాలని  నిర్ణయం తీసుకొన్నందున  ఎంపీలు  రాజ్యసభలో తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని లేఖ రాశారు. బీజేపీ బలాన్ని పెంచుకోవడంతో పాటు  టీడీపీని దెబ్బతీసింది.  

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....