చంద్రబాబు అరెస్ట్ : మనస్తాపం చెందిన టీడీపీ మహిళ.. మందుకొట్టి, అర్థనగ్నంగా హైవేపై హల్ చల్...
చంద్రబాబు అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ వార్త సోషల్ మీడియాలో వెలుగు చూసింది.

అమరావతి : స్కిల్ డెవల్మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో విచిత్ర ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ మహిళ ఫుల్లుగా మద్యం సేవించి హైవేపై అర్థనగ్నంగా హల్ చల్ చేసింది. ఈ మేరకు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆ మహిళను ఉండవల్లి అనూషగా పోలీసులు గుర్తించారు. అయితే ఆమె మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడంతో తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరై ఇలా చేసిందని సమాచారం. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు 14 రోజుల పోలీస్ రిమాండ్ కు వెళ్లడంతో.. అనూష అనే ఆ మహిళ ఫుల్లుగా మద్యం సేవించి… రోడ్డుపై బట్టలు విప్పి హంగామా చేసింది.
సీఎం జగన్ ను కలిసిన ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి
ఏలూరు హైవే పై నగ్నంగా నడుస్తూ లారీ డ్రైవర్లతో అసభ్యంగా ప్రవర్తించింది. అర్ధ నగ్నంగా తిరుగుతూ హైవే మీద వెళ్లే లారీలను ఆపింది. వారితో అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో చుట్టుపక్కల వ్యక్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వీరి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత జరిగిన విచారణలో ఆమెను ఉండవల్లి అనూషగా, టిడిపికి చెందిన యువతిగా గుర్తించారు.
ఉండవల్లి అనూషది నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలోని వేలువెన్ను గ్రామం. ఆమె ప్రస్తుతం ఏలూరులో నివాసం ఉంటుంది. ప్రస్తుతం ఒంటరిగా ఉన్న అనూష గతంలోముగ్గురిని పెళ్లి చేసుకుంది. వీరిని వదిలేసి ఒంటరి జీవనం సాగిస్తుంది. ఐటీడీపీకి అధికార ప్రతినిధిగా ప్రస్తుతం పని చేస్తుంది.
ఆదివారం రాత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించడంతో తీవ్రమనస్తాపానికి గురైంది. దీంతో బాధను తట్టుకోలేక ఫుల్ గా మద్యం సేవించింది. ఆ మత్తులోనే ఏలూరు రోడ్డుమీదికి వచ్చింది. బట్టలు విప్పేసి హల్చల్ చేస్తూ నానా హంగామా చేసింది. అర్ధనగ్నంగానే కొందరి దగ్గర డబ్బులు కూడా వసూలు చేసినట్లు… ఆమె బారిన పడిన లారీ డ్రైవర్లు చెబుతున్నారు.