సీఎం జగన్ ను కలిసిన ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి
చంద్రబాబు కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సీఎం జగన్ తో భేటీ అయ్యారు.

తాడేపల్లి : మంగళవారం ఉదయం లండన్ నుంచి తిరిగి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ ను ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కలిశారు. చంద్రబాబు కేసుకు సంబంధించిన వివరాలు ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి సీఎంకు వివరించారు. దీనికోసం సీఎం జగన్తో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి భేటీ అయ్యారు.
గత పది రోజులుగా ముఖ్యమంత్రి జగన్ లండన్ పర్యటనలో ఉన్నారు. ఈ రోజు (మంగళవారం) ఆయన తిరిగి వచ్చారు. మూడు రోజుల క్రితం చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు.. టీడీపీ నుంచి వెల్లువెత్తిన నిరసనలు.. అరెస్ట్ సందర్భంగా నెలకొన్న హై డ్రామా.. సీఐడీ నుంచి ఎలాంటి వాదనలు వినిపించారో బ్రీఫింగ్ ఇచ్చారని సమాచారం.
ఇక ముందు ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటికి సీఐడీ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుంది. కేసు ఇప్పటివరకు ఏ మలుపులు తిరిగింది.. ఇక ముందు ఎలా నడవబోతోంది...లాంటి వాటిని చర్చించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.