"సాహో" మూవీ రివ్యూ: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Aug 30, 2019, 5:42 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
 

సాహో మూవీ రివ్యూ

ఓ తెలుగు సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడటం 'బాహుబలి'తో మొదలైతే,  `సాహో`  దాన్ని కొనసాగించింది. దాంతో కేవలం తెలుగు వారి అభిరుచులు, మార్కెట్ మాత్రమే కాక దేశం మొత్తానికి సరపడే కథ,కథనం,బడ్జెట్ తో  `సాహో`  రావాల్సిన అవసరం అత్యవసరంగా ఏర్పడింది. కేవలం ఒక్క సినిమా మాత్రమే అనుభవం గల దర్శకుడు ఆ భారాన్ని , ఒత్తిడిని మోయడానికి సిద్దపడ్డాడు. 

 

జూ.ఎన్టీఆర్ పార్ట్ టైమ్, హరీష్ ఫుల్ టైమ్: కేసీఆర్ కు అల్లుడి పోటు

మంత్రి ఈటల రాజేందర్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి గులాబీ గూటిలో పరిస్థితి అంత సజావుగా లేదని అర్తమవుతోంది. ఈటల వెంటనే సర్దుబాటు చేసుకుంటూ ప్రకటన ఇచ్చినప్పటికీ పరిస్థితి అంత సజావుగా నడుస్తోంది. అసలు కేసీఆర్ వ్యూహమేమిటి... అది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందనేది చూద్దాం....

 

ఏపీలో మద్యం సిండికేట్ల మాఫియాకు.. సీఎం జగన్ చెక్

మొత్తంగా మద్యం సిండికేట్ల ఆగడాలకు కళ్లెం పడనుంది. రూ.లక్షలకు లక్షలు వెచ్చిచి తమకు అనుకూలంగా ఉన్నవారిని దారిలోకి తెచ్చుకొని తామనుకున్నది సాధించేందుకు ఎంతకైనా తెగించే రాజకీయ ప్రతినిధుల ఆగడాలు ఇకపై కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఏసీబీ కేసులకు చిక్కి, సీఐడీ కేసుల్లో ఇరుక్కున్న నేతలు బిక్కమొకాలేసుకోవాల్సిందే.

 

పవన్ కు చెప్పులు ఇచ్చిన అభిమాని: ఆ పాదరక్షలతోనే జనసేనాని పర్యటన

ఓ అభిమానితో పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. పవన్ కళ్యాణ్ కు ఆ అభిమాని చెప్పులు బహుకరించారు. కారులోనే అందరూ చూస్తుండగానే పవన్ కళ్యాణ్ ఆ చెప్పులను తొడుక్కున్నారు. అనంతరం పర్యటనలో అభిమాని ఇచ్చిన చెప్పులు వేసుకుని పవన్ కళ్యాణ్ పర్యటించారు. 

 

వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్ట్‌పై జగన్ సమీక్ష, మూడు దశల్లో అమలు

రాష్ట్రంలో శుభ్రమైన తాగునీటి సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వాటర్ గ్రిడ్ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

 

ఇసుక కొరతపై కోడెల, రంగబాబు వర్గాల వేర్వేరు ఆందోళనలు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. వైసీపీ ప్రభుత్వం ఇసుకపై అనుసరిస్తున్న విధానంపై శుక్రవారం టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, రంగబాబు వర్గాలు వేర్వేరుగా నిరసనను నిర్వహించాయి.

 

అమరావతిపై చంద్రబాబు అబద్దాలు: గల్లా జయదేవ్ చెప్పిన వాస్తవమిదీ

అమరావతిపై రోజు రోజుకో రకమైన ప్రకటన వస్తోంది. అమరావతి వరద ముంపు ప్రాంతమని గతంలో టీడీీపీ నేతలు చేసిన ప్రకటనలను అధికార వైఎస్ఆర్‌సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

 

సీఎం జగన్ ని కించపరిచేలా పోస్టు.. వ్యక్తి అరెస్ట్

అమరావతిపై రోజు రోజుకో రకమైన ప్రకటన వస్తోంది. అమరావతి వరద ముంపు ప్రాంతమని గతంలో టీడీీపీ నేతలు చేసిన ప్రకటనలను అధికార వైఎస్ఆర్‌సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

 

బాబుకు గట్టి షాక్: పార్టీ వీడనున్న ముగ్గురు సీనియర్లు

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు వరుపుల రాజా, పంచకర్ల రమేశ్ బాబుతో పాటు అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన అడారి ఆనంద్ కుమార్‌ పార్టీని వీడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత వరుపుల రాజా ఇప్పటికే టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు

 

తాజా ట్విస్ట్: ఈటల రాజేందర్ తో బీసీ సంఘాల భేటీ

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో  శుక్రవారం  నాడు పలువురు బీసీ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

 

రాష్ట్రాన్ని ప్రమాదకరమైన వ్యక్తి పాలిస్తున్నాడు: కేసీఆర్‌పై భట్టి ఫైర్

 హైదరాబాద్: రాష్ట్రాన్ని ప్రమాదకరమైన వ్యక్తి పాలిస్తున్నాడని కేసీఆర్‌పై  కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లుభట్టి విక్రమార్క విమర్శించారు. ప్రాజెక్టుల విషయమై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

 

రేణుకా చౌదరికి షాక్... నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

తన భర్తకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ రేణుకా చౌదరి మోసగించిందని చంద్రకళ  అనే మహిళ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.బాధితురాలు వేసిన పిటిషన్ ని కోర్టు స్వీకరించింది. ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం రేణుకాకు నోటీసులు జారీ చేసింది. 

 

భూమి కోసం వెళ్లా.. పార్టీ మారడానికి కాదు: వైఎస్‌తో భేటీపై ఈటల వివరణ

ఎంతో చెమటోడ్చి.. కష్టపడి సంపాదించిన పైసలతో కొన్న నా భూమిని గుంజుకోవద్దని అప్పటి సీఎంతో చెప్పానని ఈటల తెలిపారు. నీ పాత అలైన్‌మెంట్ ప్రకారం చేసుకోమని చెప్పానని.. కానీ, తన భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశానని.. అంతేకాని పార్టీ మారతానని మాత్రం చెప్పలేదని ఈటల వెల్లడించారు

 

అల్లు శిరీష్, పూజా హెగ్డేలకు నోటీసులు: క్యూనెట్ మోసంపై మరోసారి...

లక్షలాది మంది కస్టమర్లు ఆ సంస్థలో చేరడానికి బాలీవుడ్, టాలీవుడ్ లకు చెందిన ప్రముఖ హీరోలు, సెలబ్రెటీల ప్రచారమే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. ఆ సంస్థ తరఫున ప్రచారం చేసినవారిలో సెలబ్రెటీలు అనిల్ కపూర్, షారూక్ ఖాన్, బొమన్ ఇరానీ, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్, అలు శిరీష్, పూజా హెగ్డే, యువరాజ్ సింగ్ తదితరులున్నారు. 

 

వ్యాఖ్యలపై కలకలం: ఈటెల రాజేందర్ యూటర్న్

హుజురాబాద్‌లో కాంగ్రెస్ నాయ‌కుడు  కాసిపేట శ్రీ‌నివాస్ చేరిక సంద‌ర్భంగా తాను చేసిన ప్ర‌సంగాన్ని కొన్ని వార్త ఛాన‌ళ్లు, సోష‌ల్ మీడియాలోని కొన్ని వ‌ర్గాలు వ‌క్రీక‌రించాయని ఈటల రాజేందర్ అన్నారు. ఇది స‌రికాదని అన్నారు.  తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన యూటర్న్ తీసుకున్నారు.

 

మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో పాగాకు బీజేపీ ప్లాన్

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించేందుకు ప్లాన్  చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

 

'సాహో' తొలిరోజు ఎంత వస్తుందంటే..?

సాహో సరికొత్త రికార్డులని నెలకొల్పుతూ తెలుగు సినిమాకు మరో గర్వకారణంగా మారుతోంది. బాలీవుడ్ వర్గాలని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తేలా ఓ తెలుగు సినిమా 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కడం విశేషం. బాహుబలి తర్వాత మరోసారి అంతటి అనుభూతిని అందించాలని ప్రభాస్ భావించాడు. 

 

'సాహో'ని ఫ్లాప్ అంటోంది పవన్ ఫ్యాన్సే.. శ్రీరెడ్డి కామెంట్స్!

ఎక్కడ ఎవరు ఎందుకు ఏమన్నా.. అది తిప్పి తిప్పి పవన్ కళ్యాణ్ దగ్గరకు, వాళ్ల ఫ్యాన్స్‌ దగ్గరకు తీసుకురావడం అలవాటుగా చేసుకున్న ఆమె మళ్లీ పవన్ ఫ్యాన్స్‌ని ఎటాక్ చేస్తుంది.
 

'సాహో' హైలైట్స్.. థియేటర్లో అభిమానుల కెవ్వుకేక!

‘సాహో’ థియేటర్స్‌కి వచ్చేశాడు. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు (ఆగస్టు 30) థియేటర్స్‌లో విడుదలైంది. తమ అభిమాన నటుడ్ని ఎప్పుడెప్పుడు వెండితెరపై చూస్తామా అని ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆరున్నర అడుగుల రియల్ కటౌట్ చూసి ఫిదా అవుతున్నారు.

 

సాహో : ప్రభాస్ ఇంట్రో సీన్ లీక్..!

 ‘సాహో’ థియేటర్స్‌కి వచ్చేశాడు. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు (ఆగస్టు 30) థియేటర్స్‌లో విడుదలైంది. తమ అభిమాన నటుడ్ని ఎప్పుడెప్పుడు వెండితెరపై చూస్తామా అని ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆరున్నర అడుగుల రియల్ కటౌట్ చూసి ఫిదా అవుతున్నారు.
 

బిగ్ బాస్ 3 : ట్రైన్ ఎపిసోడ్, లవ్ స్టోరీతో విసిగించేశారు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 39 ఎపిసోడ్‌లను పూర్తి చేసి బుధవారం నాటితో 40 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
 

అవాస్తవాలను ప్రచారం చేయకండి.. ప్రభాస్ ఫ్యాన్స్ కి శ్రద్ధా వార్నింగ్!

 ఈరోజు కోసం యంగ్‌ రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌తోపాటు సినీప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూశారు. ఎందుకంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ‘సాహో’ చిత్రం విడుదలైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విజయం దిశగా దూసుకుపోతోంది. 
 

'రష్మీ రాకెట్' గా తాప్సి బయోపిక్ మూవీ

టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తాప్సి పన్ను కెరీర్ విషయంలో కొన్నాళ్ల వరకు చాలా స్ట్రగుల్ అయ్యింది. మొత్తానికి బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటుంది. తెలుగులో వరుస అపజయాలతో సతమతమయినప్పటికీ బేబీ ఇప్పుడు హిందీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 

 

అది రాజమౌళి, శంకర్ లకు మాత్రమే సాధ్యమా!

సాహో చిత్రం అనుకున్న విధంగానే ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. దాదాపు 10 వేల స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ నటించిన ఈ యాక్షన్ చిత్రానికి ఎంతలా డిమాండ్ ఉందో అని. 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం, బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 

 

ప్రీమియర్ షోలతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు.. షాకిచ్చిన సాహో

భారీ అంచనాల నడుమ విడుదలైన బిగ్ బడ్జెట్ మూవీ సాహో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా యూఎస్ ప్రీమియర్స్ ద్వారా అనుకున్నంతగా సత్తా చాటలేకపోయింది. బాహుబలి సినిమాలతో ఈజీగా 1 మిలియన్ మార్క్ ను అందుకున్న ప్రభాస్ ఈ సారి డాలర్స్ ని ఆ స్థాయిలో రాబట్టలేకపోయాడు. అమెరికాలో అత్యధిక డాలర్స్ అందుకున్న టాప్ 10 సినిమాలు ఇవే.  

 

 

 

 

 

 

 

 

click me!